Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొట్టకండి.. ఇక ఆలయంలోకి వెళ్లను.. దళిత యువకుడి రోదన (వీడియో)

Advertiesment
కొట్టకండి.. ఇక ఆలయంలోకి వెళ్లను.. దళిత యువకుడి రోదన (వీడియో)
, గురువారం, 6 జూన్ 2019 (12:07 IST)
కొట్టకండి.. ఇక ఆలయంలోకి వెళ్లను.. అంటూ ఓ దళిత యువకుడు ఎంతగా రోదించినా.. దారుణంగా అతనిపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆలయంలోకి ప్రవేశించిన కారణంగా ఓ దళిత యువకుడిని కట్టేసి.. నలుగురు దారుణంగా దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, బాలీ జిల్లాలో ఓ దళిత యువకుడు ఆ ప్రాంతంలోని ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. కానీ అతనిని అడ్డుకున్న ఉన్నత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు.. ఆ యువకుడిపై విచక్షణా రహితంగా దాడులు చేశారు. 
 
కాళ్లుచేతులు కట్టేసి.. అతి దారుణంగా యువకుడిపై దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిపై దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. 
 
అయితే దాడికి గురైన యువకుడిపై కేసు నమోదైంది. ఆ యువకుడు ఆలయ అర్చకుడి కుమార్తె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. అందుకే ఆ యువకుడిని ఆలయంలోకి ప్రవేశించకూడదని చెప్పినట్లు దాడికి పాల్పడిన వ్యక్తులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం చేస్తే రూ.31.66 కోట్లా?