Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్యత్వ పరీక్ష అంటే స్త్రీల గౌరవానికి భంగం కలిగించడమే : ఢిల్లీ హైకోర్టు

Advertiesment
victim girl
, బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (12:02 IST)
కన్యత్వ పరీక్షకు శాస్త్రీయత లేదని, ఒకవేళ అలాంటి పరీక్ష మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షకు ఖచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనమే లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు క్రైస్తవ సన్యాసి మృతి కేసులో కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. 
 
1992లో క్రైస్తవ సన్యాసిని (నన్) మృతి కేసు విచారణలో భాగంగా తనకు కన్యత్వ పరీక్షలు నిర్వహించాలంటూ సెఫీ అనే మరో నన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. 
 
"మహిళా నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం దర్యాప్తులో భాగం కాబోదు. కస్టలో ఉన్న నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమే. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇది ఆర్టికల్ 21 ఉల్లంఘనే" అని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభిప్రాయపడ్డారు. 
 
కన్యత్వ పరీక్షకు ఖచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనే లేదని, అయినప్పటికీ ఈ పరీక్షలు మహిళల స్వచ్ఛతకు చిహ్నంగా మారిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అమానుషమన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ పరీక్షలకు శాస్త్రీయత లేదని చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. 
 
ఇకపోతే కస్టోడియల్ డిగ్నిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ, మహిళలు గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలిగేలా ఎవరూ ప్రవర్తించినా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్సులు..