Gujarat Man Beats Bank Manager ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్.డి)లపై టీడీఎస్‌ను పెంచారు. ఇది ఓ కస్టమర్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో సదరు కస్టమర్ బ్యాంకుకు వెళ్లి బ్యాంకు మేనేజరుతో గొడవకు దిగాడు. ఈ గొడవ కాస్త పెద్దకి కావడంతో వారిద్దరూ బ్యాంకులో తలపడ్డారు. ఒకరి చొక్కా కాలర్ ఒకరు పట్టుకున్నారు. ఈ ఆసక్తికరమైన ఘనట గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
స్థానికంగా ఉండే యూనియన్ బ్యాంకులో జైమ్ రావల్ అనే కస్టమర్ ఎఫ్.డిలు వేశారు. అయితే, వీటికి వసూలు చేసే టీడీఎస్‌ను పెంచారు. ఇది కస్టమర్‌ను తీవ్ర నిరాశకు లోను చేసింది. ఇదే విషయంపై బ్యాంకు మేనేజరును నిలదీయగా, వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ తలపడ్డారు. చొక్కా కాలర్లు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కాలర్ పట్టుకుని కొట్టుకోవడం వీడియోలో కనిపించింది. మేనేజర్‌ని తలపై కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. కస్టమరుతో పాటు ఉన్న ఒక మహిళ వీరిద్దర్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో ఒకరి చేయి పట్టుకుని పక్కకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కస్టమర్‌ను ఒక చెంపదెబ్బ కూడా కొట్టి గొడవ ఆపాలని కోరారు.
చివరకు ఇద్దరూ గొడవ ఆపి దూరంగా జరిగారు. అయితే సదరు కస్టమర్ రెండోసారి దాడికి తెగబడ్డాడు. ఈసారి మరో బ్యాంక్ ఉద్యోగితో గొడవకు దిగడం గమనార్హం. అహ్మదాబాద్ నగరంలోని వస్త్రాపూర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై వస్త్రాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.