Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశీ వేశ్యలతో వరుణ్ గాంధీ... ఆయుధ వ్యాపారి వర్మ స్నేహితుడు విక్కీ చౌదరి

విదేశీ వేశ్యలతో (ఎస్కార్ట్) బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. వీటిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభ

Advertiesment
విదేశీ వేశ్యలతో వరుణ్ గాంధీ... ఆయుధ వ్యాపారి వర్మ స్నేహితుడు విక్కీ చౌదరి
, శనివారం, 22 అక్టోబరు 2016 (12:37 IST)
విదేశీ వేశ్యలతో (ఎస్కార్ట్) బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. వీటిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ స్నేహితుడు విక్కీ చౌదరి మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఈ తరహా ఫోటోలను తాను కొన్నేళ్ల క్రితమే చూశానని, అవి కొత్తవేమీ కావని చెప్పాడు. అభిషేక్ వర్మతో కలిసి తాను ఆయుధ వ్యాపారుల పార్టీలకు హాజరయ్యానని.. అందులో కొందరి వద్ద విదేశీ వేశ్యలతో ఉన్న వరుణ్‌గాంధీ ఫొటోలు చూశానని తెలిపారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ మాజీ వ్యాపార భాగస్వామి సీ ఎడ్మండ్స్ అల్లెన్ అని, 2016 సెప్టెంబర్ 16వ తేదీతో రాసిన లేఖల్లో వరుణ్‌ గాంధీ తరుచూ ఆయుధ వ్యాపారులు ఏర్పాటుచేసే పార్టీలకు హాజరయ్యేవాడని, విదేశీ భామలతో సరసాలాడేవాడని తెలిపారు. 
 
కాగా, దీనిపై వరుణ్‌గాంధీ స్పందిస్తూ.. అభిషేక్ వర్మ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని, అలా తనకు వర్మతో పరిచయం ఉన్నదని తెలిపారు. వర్మ పెండ్లికి కూడా తాను హాజరయ్యానని, ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాక అతడిని కలువడం జరుగలేదని స్పష్టం చేశారు. తనపై బురదజల్లేవారిని వదిలిపెట్టే సమస్యే లేదని.. వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్రికా దేశం కామెరూన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 55 మంది మృతి