Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎద్దును ఢీకొని చొట్టపడిన వందే భారత్ రైలు

vande bharat
, ఆదివారం, 21 మే 2023 (13:54 IST)
వందే భారత్ రైలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ రైలు. దేశంలో దీన్ని మించిన రైలు లేదంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, ఈ రైలు ఫిట్నెస్ ఇపుడు ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి ఎద్దును ఢీకొట్టడంతో వందే భారత్ రైలు చొట్టబడింది. ఓ ఎద్దు పట్టాలపైకి దూసుకుని రావడంతో దాన్ని వందే భారత్ రైలు ఢీకొట్టింటి. దీంతో రైలు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని కోల్వా - అరానియా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ, రైలు ముందు భాగం మాత్రం బాగా చొట్టబడిపోయింది. ఈ ఘటన తర్వాత వందే భారత్ రైలు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత అధికారులు, రైల్వే సిబ్బంది వచ్చి ఎద్దును తొలగించిన తర్వాత తిరిగి బయుదేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగలో మార్పు తెచ్చిన భగవద్గీత... చోరీ చేసిన నగలను తిరిగిచ్చేశాడు..