Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రొఫెసర్ కాదు.. కామాంధుడు... మహిళా విద్యార్థినలతో అసభ్య ప్రవర్తన (Video)

Advertiesment
professor harassment

ఠాగూర్

, మంగళవారం, 18 మార్చి 2025 (11:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్‌ జిల్లాలో సేథ్‌పూల్ చంద్ బంగ్లా పీజీ కాలేజీలో మహిళా విద్యార్థినుల పట్ల ఓ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కామాంధుడు పేరు రజనీష్ కుమార్. అనేక మంది మహిళా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఓ అజ్ఞాత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, కాలేజీ యాజమాన్యం కూడా ఆ కామంధ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్ 
 
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రూ.250 కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగంపై చర్చ జరిగింది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ, గత వైకాపా హయాంలో మొత్తం 250 కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటుచేసుకున్నట్టు పలు నివేదికల ద్వారా వెల్లడైందన్నారు. 
 
ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హమీ పనులపై సోషల్ ఆడియా నిర్వహించిందన్నారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు జరిగినట్టు వెలుగు చూశాయన్నారు. ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్దిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్ళాయని ఆయన ఆరోపించారు. 
 
ఈ నిధుల దుర్వినియోగంపై ఆడిట్ ప్రక్రియ మొదలైందన్నారు. ఈ ఆడిట్‌ను వేగవంతం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన మండలాల్లో కూడా ఆడిట్ పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులను సమీక్షించి, అవినీతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సభకు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం అనేది కేంద్ర పరిధిలో ఉంటుందని పవన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 



 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరదాగా వాటర్ ట్యాంక్ ఎక్కిన చిన్నారులు... కూలిపోవడంతో ఇద్దరు మృతి