Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నయ్యతో హలాలాకు నిరాకరించిందనీ మాజీ భార్యపై ...

అన్నయ్యతో హలాలాకు నిరాకరించిందనీ మాజీ భార్యపై ...
, గురువారం, 30 జూన్ 2022 (10:55 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో దారుణం జరిగింది. తన అన్నయ్యతో హలాలాకు నిరాకరించిందని మాజీ భార్యపై ఓ కిరాతక భర్త ద్రావకంతో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బరేలీ జిల్లాకు చెందిన ఇషాక్‌ అనే వ్యక్తి 11 ఏళ్ల క్రితం నస్రీన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇటీవలే అతడి చిన్న కుమార్తెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్యకు ముమ్మారు తలాక్‌ చెప్పాడు. వెంటనే బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తపై ఎలాంటి కేసులు పెట్టలేదు. మరోవైపు, నస్రీన్‌ను మళ్లీ భార్యగా స్వీకరిస్తానని ఇషాక్‌ సందేశాలు పంపాడు. అదేసమయంలో ఓ షరతు పెట్టాడు. మళ్లీ తనతో కలిసి జీవించాలంటే తన అన్నయ్యతో హలాలా చేసుకోవాలని కోరాడు. అందుకు బాధితురాలు అంగీకరించలేదు. 
 
ఇటీవలే ఆమెను కలవడానికి వెళ్లిన ఇషాక్‌.. హలాలా విషయమై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె పూర్తిగా నిరాకరించడంతో.. ముఖంపై యాసిడ్‌ పోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
 
హలాలా అంటే ఏంటి?
విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళ మళ్లీ భర్తను పెళ్లి చేసుకోవాలంటే దానికంటే ముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అతడికి విడాకులు ఇవ్వడమో లేదంటే అతడు మరణించే వరకు జీవించి ఉండడమో చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆమె మళ్లీ తన భర్తను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకు వయసు పెరిగిపోయింది.. పాఠాలు ఏమి చెప్పగలరు : మంత్రి బొత్స