సార్.. నేను అమ్మాయిని.. పెళ్లి కుదిరింది.. పాస్ చేయండి ప్లీజ్.. : ఆన్సర్ షీట్‌లో విద్యార్థిని వేడుకోలు
పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు అష్టకష్టాలు పడుతుంటారు. పక్క విద్యార్థుల నుంచి, చిట్టీలను కాపీ కొట్టడం... ఇలా నానా తంటాలు పడుతుంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్
పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు అష్టకష్టాలు పడుతుంటారు. పక్క విద్యార్థుల నుంచి, చిట్టీలను కాపీ కొట్టడం... ఇలా నానా తంటాలు పడుతుంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని సరికొత్తగా ఆలోచన చేసింది.
పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉండటంతో ఆన్సర్లు రాయలేక పోయింది. దీంతో తాను ఫెయిల్ కావడం తథ్యమనే నిర్ధారణకు వచ్చింది. అయితే, ఎలాగైనా ఈ పరీక్షల్లో పాస్ కావాలన్న ఉద్దేశ్యంతో జవాబు పత్రాలపై తనను పాస్ చేయాలంటూ అభ్యర్థించింది.
సార్, నేను ఓ అమ్మాయిని, వచ్చే జూన్ 28న, నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండంటూ జవాబు పత్రం మీద రాసింది. తాను ఫెయిల్ అయితే తమ కుటుంబమంతా బాధపడుతోందని ఆమె చెప్పుకొచ్చింది. తన పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్స్‌లో ఓ విధ్యార్థిని రాసింది.