తీవ్రవాదులకు అడ్డాగా తమిళనాడు : కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్
తమిళనాడు రాష్ట్రంపై కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రం తీవ్రవాదులకు అడ్డాగా మారిపోయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని నక్సలైట్లు, తీవ్రవాదులు రాష్ట్రంలోకి పెద్దఎత్తు
తమిళనాడు రాష్ట్రంపై కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రం తీవ్రవాదులకు అడ్డాగా మారిపోయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని నక్సలైట్లు, తీవ్రవాదులు రాష్ట్రంలోకి పెద్దఎత్తున చొరబడ్డారని వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, తాను ఎప్పటి నుంచో ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. తీవ్రవాద కార్యకలాపాలకు తమిళనాడు అడ్డాగా మారింది. జల్లికట్టు ఆందోళన సందర్భంగా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఏడాదిన్నర నుంచి ఇదే విషయమై నేను ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.
ముఖ్యంగా, రాష్ట్రంలో ధర్మపురి, నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి వంటి కొండప్రాంతాల్లో నక్సలైట్ శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం తీవ్రవాదులు కొన్ని మీడియా సంస్థల్లోకి కూడా చొరబడ్డారనీ పేర్కొన్నారు.