కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి కావడం విశేషం.
ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగ కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వాక్యాల్లో ప్రస్తావించారు.
ఈ బడ్జెట్ ప్రసంగానికి ముందు విపక్షాలు తీవ్ర నిరసన తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కోరుతూ విపక్షాలు నిరసన తెలిపాయి. అనంతరం సభ నుంచి కొంతమంది వాకౌట్ చేశారు. ఈ పరిణామాల మధ్యే బడ్జెట్ ప్రసంగం సాగుతోంది.
అంతకుముందు బడ్జెట్ ట్యాబ్‌ను తీసుకుని ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రథమ పౌరురాలి అనుమతి తీసుకుని పార్లమెంట్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అనంతరం వార్షిక పద్దును నిర్మలమ్మ సభకు సమర్పించారు.