నీలి చిత్రాలు చూపించి.. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం...
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. దిక్కూమొక్కూ లేని అమ్మాయిలకు ఆశ్రయంతో పాటు రక్షణ కల్పించి.. పునరావాసం కల్పించాల్సిన సర్కారు పునరావాస కేంద్రం ఉద్యోగులే కామాంధులుగా మారిపోయారు. ఫల
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. దిక్కూమొక్కూ లేని అమ్మాయిలకు ఆశ్రయంతో పాటు రక్షణ కల్పించి.. పునరావాసం కల్పించాల్సిన సర్కారు పునరావాస కేంద్రం ఉద్యోగులే కామాంధులుగా మారిపోయారు. ఫలితంగా ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
భోపాల్‌కు సమీపంలోని షోడోల్ జిల్లాలోని ఓ బాలికల పునరావాస కేంద్రం ఉంది. ఇక్కడ మహిళా సూపరింటెండెంట్ భర్త, క్లర్కు కలిసి ఇద్దరు బాలికలకు నీలి చిత్రాలు చూపిస్తూ.. ఆపై తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ కామాంధులు పెట్టే లైంగికవేధింపులను తాళలేక ఆ ఇద్దరు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదుపై పునరావాసకేంద్రం సూపరింటెండెంట్ భర్త, క్లర్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని షోడోల్ జిల్లా ఎస్పీ సుశాంత్ చెప్పారు.