Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం… డాక్టర్ బీఆర్ అంబేద్కర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా శనివారం జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా, రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత

Advertiesment
అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం… డాక్టర్ బీఆర్ అంబేద్కర్
, శనివారం, 14 ఏప్రియల్ 2018 (09:19 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా శనివారం జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా, రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
 
కాగా, అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆయన 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోవ్ గ్రామంలో జన్మించారు. పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. చదువుకోవాలంటే కులం అడ్డు వచ్చింది. మంచినీళ్ళు తాగాలంటే కులమే అడ్డుగా నిలబడింది. అయినా పట్టువదని విక్రమార్కుడిగా ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించాడు. న్యాయ కోవిదుడయ్యాడు. 
 
తన బాల్యంలో పడిన అవమానాలు భావితరాల వారికి ఉండరాదన్న ఏకైక లక్ష్యంతో సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. అలాంటి మహనీయుడు జయంతి వేడుకలను శుక్రవారం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆయనకు ఘనంగా నివాళి అర్పించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీకి కావేరీ సెగలు... గుర్రుగా తమిళ తంబీలు