Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

6వ రోజూ బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం... కేంద్రానికి దిమ్మతిరిగింది... కొత్త మాట చెప్పింది...

పెద్ద నోట్లు రద్దు చేసి 6 రోజులు గడిచిపోయినా దేశంలో ఏటీఎంలు తెరుచుకోలేదు. చేతిలో డబ్బులేక ప్రజలు విలవిలలాడుతున్నారు. కష్టపడి క్యూల్లో నిలబడి డబ్బు తీసుకుంటున్నా అవి రూ. 2000 కాగితాలే కావడంతో ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆ నోట్లను తీసుకెళ్లి ఏదయినా కొను

6వ రోజూ బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం... కేంద్రానికి దిమ్మతిరిగింది... కొత్త మాట చెప్పింది...
, సోమవారం, 14 నవంబరు 2016 (17:04 IST)
పెద్ద నోట్లు రద్దు చేసి 6 రోజులు గడిచిపోయినా దేశంలో ఏటీఎంలు తెరుచుకోలేదు. చేతిలో డబ్బులేక ప్రజలు విలవిలలాడుతున్నారు. కష్టపడి క్యూల్లో నిలబడి డబ్బు తీసుకుంటున్నా అవి రూ. 2000 కాగితాలే కావడంతో ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆ నోట్లను తీసుకెళ్లి ఏదయినా కొనుగోలు చేద్దామంటే దుకాణాదార్లు తమ వద్ద చిల్లర లేదని మొహం మీదే చెప్పేస్తున్నారు. 
 
దీనితో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర కీలక సభ్యులతో భేటీ అయ్యారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే సమస్య జఠిలమవుతుందని అంతా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయిదాటకుండా ఉండేదుకు పాతనోట్లనే... అంటే రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్లనే మరో 10 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పన్నులు, మెడికల్ షాపులంతా అంగీకరించాలని ఆదేశించారు. కానీ వాళ్లు తీసుకుంటారా అన్నదే ప్రశ్న.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అకటా... పెళ్ళి చదివింపులకూ ఎంత కష్టం... స్వైప్ మిషన్లు తప్పదా?