Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత విమానాల్లోనూ ఇకపై వైఫై సేవలు.. శాటిలైట్ ద్వారా ప్రయాణీకులకు వైఫై సర్వీస్..

భారత విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇకపై భారత విమానాల్లో ప్రయాణీకులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయని సెక్రటరీ టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌

Advertiesment
Telecom Department Moves Proposal To Allow Wi-Fi In Flights
, బుధవారం, 23 నవంబరు 2016 (14:35 IST)
భారత విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇకపై భారత విమానాల్లో ప్రయాణీకులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయని సెక్రటరీ టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా రాజ్యసభలో తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో సంబంధం లేకుండా.. స్వతంత్ర్యంగా ఈ వైఫై వ్యవస్థ పనిచేస్తుందని కూడా ఆయన చెప్పారు. 
 
దీని ద్వారా విమానాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని జయంత్ సిన్హా వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను అమలు చేయాలంటే భారత టెలిగ్రాఫ్‌ చట్టం-1885లో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుందని.. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు విమానయాన సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే భద్రత కారణాల ద్వారా విమానంలో వైఫై సేవలను భారత్ దూరంగా ఉంచింది. 
 
కానీ భారత సంస్థలు కూడా ఇకపై విమానాల్లో వైఫై సేవలను అందించేందుకు రెడీ అవుతున్నాయి. విస్తారా సంస్థ ఇప్పటికే విమానంలో వైఫై కోసం ట్రయల్ కూడా నిర్వహించింది. శాటిలైట్ ద్వారా వైఫై కనెక్టివిటీని విమానాల్లో పొందుపరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విధానానికి భారీగా ఖర్చయ్యే అవకాశం ఉందని జయంత్ సిన్హా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ కలలో మాటిచ్చావ్ కదా.. నా పెళ్లి సంగతేంటి.. నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు!