Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాతో స్నేహం చేస్తూనే నా భార్యనే ఉంచుకుంటావా?

Advertiesment
నాతో స్నేహం చేస్తూనే నా భార్యనే ఉంచుకుంటావా?
, సోమవారం, 26 నవంబరు 2018 (08:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మాజీ కానిస్టేబుల్ తన స్నేహితుడుని కాల్చి చంపాడు. తనతో స్నేహం చేస్తూనే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా పాలషిపర పట్టణానికి చెందిన బిభాష్ మండల్, సుభాష్ బిశ్వాస్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణస్నేహితులు. వీరిలో బిభాష్ మండల్ సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. 
 
ఈ క్రమంలో బిభాష్ మండల్ భార్యతో సుభాష్ బిశ్వాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీన్ని గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బిభాష్ మండల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
అంతే.. తుపాకీ తీసుకొచ్చి ఓ దుకాణం వద్ద ఉన్న సుభాష్ బిశ్వాస్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వా బిభాస్ అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను సీఎం చేస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో చూడండి: అక్బరుద్ధీన్