Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ గ్రామంలో 'ద్రౌపది' సంప్రదాయం.. ఒక స్త్రీ ఎంతమందినైనా పెళ్లాడవచ్చు... ఎక్కడ?

Advertiesment
marriage
, సోమవారం, 5 డిశెంబరు 2022 (10:53 IST)
మహాభారతంలో పాంచాలి (ద్రౌపది) ఐదుగురు భర్తలకు భార్య. ఇలాంటి ఉదాహరణలు మన దేశ చరిత్రలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా, ఒక స్త్రీ ఎంతమంది పురుషులనైనా పెళ్లాడవచ్చు. వారితో సఖ్యతగా సంసార జీవితాన్ని గడవచ్చు. ఇలాంటి ఆచారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు గిరిజన గ్రామాల్లో నేటికీ కొనసాగుతోంది. 
 
తాజాగా హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లోని మహిళలు ఒకే ఇంటిలోని ఐదుగురు లేదా ఏడుగురు సోదరులను వివాహం చేసుకునే అవకాశం ఉంది. వీరంతా కలిసి మహాభారతంలోని పంచపాండవులా కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నారు. 
 
ఈ గిరిజన గ్రామాల్లో పాండవులు వనవాసం చేశారని ఈ ప్రాంత వాసులు బలంగా నమ్ముతారు. అందుకే తమ ఇంటిలోని అమ్మాయికి వివాహం నిశ్చయించినపుడు వరుడు కుటుంబంలోని అబ్బాయిలందరి గురించి సమాచారం తెలుసుకుంటారు. తర్వాత తమ అమ్మాయికి ఆ సోదరులందరితో వివాహం చేస్తారు. 
 
పెళ్లి అయ్యాక ఒక సోదరుడు వధువుతో గదిలో ఉంటే అతను తన టోపీని తలుపు వద్ద ఉంచుతాడు. మిగిలిన సోదరులు ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తారు. తలుపు వద్ద టోపీ ఉంచినపుడు ఇతర సోదరులు ఎవరూ గదిలోకి ప్రవేశించరు. ఈ పద్ధతి కారణంగా వారి వైవాహిక జీవితంపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడదు. ఈ సంప్రదాయం కారణంగా కుటుంబ ఆస్తి కూడా విభజనకు దారితీయదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడి మోజులోపడి స్నేహితుడి ద్వారా భర్తకు సైనైడ్ ఇచ్చిన భార్య...