Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధానికి లేని ఇబ్బంది మీకెందుకు.. ప్రియాంక ఏ దుస్తులు ధరిస్తే మీకెందుకు: సన్నీ క్వశ్చన్

జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా ధరించిన దుస్తుల వ్యవహారం ఇంకా సద్దుమణుగుతున్నట్లు లేదు. బెర్లిన్‌లో మోదీతో జరిగిన భేటీలో ప్రియాంక సభ్యతను, సంప్రదాయాలను కించపరిచేలా దుస్తులు ధరించిందంటూ, పైగా దేశ ప్రధాని

Advertiesment
Sunny Leone
హైదరాబాద్ , శనివారం, 3 జూన్ 2017 (10:01 IST)
జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా ధరించిన దుస్తుల వ్యవహారం ఇంకా సద్దుమణుగుతున్నట్లు లేదు. బెర్లిన్‌లో మోదీతో జరిగిన భేటీలో ప్రియాంక సభ్యతను, సంప్రదాయాలను కించపరిచేలా దుస్తులు ధరించిందంటూ, పైగా దేశ ప్రధాని ఎదుట కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఏమాత్రం సభ్యత కాదంటూ నెటిజన్లు ప్రియాంకను తూర్పారపట్టడం కూడా వివాదాస్పదమైంది. అటు ప్రధాని, ఇటు ప్రియాంక ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యా చేయకుండా హుందాగా వ్యవహరించినప్పటికీ సోషల్ మీడియాలో దుమారం మాత్రం చెలరేగుతూనే ఉంది.
 
ఈ నేపథ్యంలో ప్రియాంక దుస్తుల వ్యవహారంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు పలుకుతూ ట్వీట్ చేస్తున్నారు. ఈ కోవలోకి నటి సన్నీ లియోన్ తాజాగా వచ్చి చేరారు.  ఏ దుస్తులు ధరించాలి అనేది  ప్రియాంక యిష్టమని, వేసుకున్న దుస్తులను కాకుండా, వారి చర్యలను చూడాలని  కోరారు. మనం ఒకర్నొకరు ప్రేమించుకోవాలి తప్ప ద్వేషించు కోకూడదని చెప్పారు. ప్రియాంక లాంటి వ్యక్తులను ధరించిన దుస్తుల ఆధారంగా కాకుండా..వారి వ్యక్తిత్వాన్ని చూడాలంటూ  ప్రియాంకకు మద్దుతుగా నిలిచారు.  ప్రియాంకకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయని, సమాజానికి ఎంత సేవ చేస్తున్నారో తనకు తెలుసుననీ  చెప్పారు.  
 
ప్రియాంక లాంటి వ్యక్తులను ధరించిన దుస్తుల ఆధారంగా కాకుండా..వారి వ్యక్తిత్వాన్ని చూడాలంటూ  ప్రియాంకకు మద్దుతుగా నిలిచారు.  ప్రియాంకకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయని, సమాజానికి ఎంత సేవ చేస్తున్నారో తనకు తెలుసుననీ  చెప్పారు.  అత్యంత హుందాతనం ఉన్న వ్యక్తిని భారత ప్రధానిగా ఎన్నుకొన్నాం. ఆయన ఏ విషయంపైనైనా నిక్కచ్చిగా మాట్లాడుతారు. కుండ బద్దలు కొట్టినట్టు చెపుతారు. ప్రియాంక వ్యవహారంలో ఆయనకు ఏదైనా సమస్య ఉంటే ఆమెకు నేరుగా చెప్తారు.. కానీ  ప్రధాని అలా చేయలేదనీ సన్నీ వ్యాఖ్యానించారు.
 
కాగా ప్రధాని నరేంద్రమోదీతో జర్మనీలో కలుసుకున్నప్పటి ఒక ఫోటోను సోషల్‌ మీడియాలో  ప్రియాంక  చోప్రా షేర్‌  చేయడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు.  దీంతో తన దుస్తులపై  నెటిజన్ల ఆగ్రహంపై ప్రియాంక  ఘాటుగానే స్పందించారు. తన తల్లి వద్ద కూడా తాను అలానే ఉంటానంటూ తల్లి మధు చోప్రాతో కలిసి ఉన్న ఫోటోను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారిపై వాచ్‌మెన్ అసభ్య ప్రవర్తన.. బాలిక అనారోగ్యానికి గురికావడంతో..