Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజన్‌ దైవదూత.. నేను దెయ్యాన్నా? మీడియా ఆకాశానికెత్తేస్తోంది : స్వామి ఫైర్

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు లక్ష్యంగా ఎంచుకున్నారు. రాజన్ దైవదూత అయితే.. తాను దెయ్యాన్నా అంటూ మండిపడ్డారు.

Advertiesment
Subramanian Swamy
, సోమవారం, 8 ఆగస్టు 2016 (08:31 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు లక్ష్యంగా ఎంచుకున్నారు. రాజన్ దైవదూత అయితే.. తాను దెయ్యాన్నా అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో మీడియాను కూడా దుయ్యబట్టారు. రాజన్‌ను మీడియా ఆకాశానికెత్తేస్తోందంటూ మండిపడ్డారు. 
 
ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రాజన్‌ను దైవదూతలా, నన్ను దెయ్యంలా మీడియా చిత్రీకరిస్తోంది. మీడియా ప్రచారం తీరు చూస్తే, మనల్ని రక్షించడం కోసం ఆయన విదేశాల నుంచి దిగివచ్చినట్టుగా ఉంది. ఆయన్ను మీడియా బాగా ఎత్తేస్తోంది. రాజన్‌ వైదొలిగితే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలిపోతుందని మీడియానే భయపెట్టింది. కానీ వాస్తవంలో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. వడ్డీ రేట్లు పెంచి.. చిన్న, మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులకు అప్పులు పుట్టకుండా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్‌ నష్టం చేస్తున్నారంటూ  సుబ్రమణ్య స్వామి విమర్శలు ఎక్కుపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రపోతున్న తొమ్మిదేళ్ళ బాలికను ఇంటి మిద్దెపైకి తీసుకెళ్లి 16 యేళ్ల బాలుడు రేప్!