ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతుండగా.. తాజాగా కొన్ని రోజులుగా తెలంగాణలో కరెంటు మీటర్ల రాజకీయం హీటెక్కింది.
ఈ ఇష్యూపై కేసీఆర్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర సర్కార్. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వ్యసాయ బోర్లు, బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని, మెడపై కత్తి పెట్టిందని ఆరోపించారు కేసీఆర్.
కానీ కేసీఆర్ ఆరోపణలను కేంద్ర విద్యుత్ శాఖ తీవ్రంగా ఖండించింది. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని స్పష్టం చేసింది. పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి ఏ రాష్ట్రంపైనా ఇప్పటి వరకు ఒత్తిడి చేయలేదని తెలిపింది.
సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని, విద్యుత్ కొనుగోలు వ్యవహారాలన్నీ ఓపెన్ బిడ్ల ద్వారానే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.