Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రాహ్మణి పెళ్లికి రూ.300 కోట్లు?... ఐటీ ప్రశ్నలతో గాలి జనార్ధన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి దిక్కుతోచడం లేదు. తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశానన్న సంతోషం ఏమాత్రం మిగలలేదు. దీనికి కారణం ఆదాయ పన్ను శాఖ అధికారులే. ఈ వివాహం తర్వాత ఆయన మైనింగ్ కా

Advertiesment
Janardhan Reddy's Daughter marriage
, గురువారం, 24 నవంబరు 2016 (09:02 IST)
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి దిక్కుతోచడం లేదు. తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశానన్న సంతోషం ఏమాత్రం మిగలలేదు. దీనికి కారణం ఆదాయ పన్ను శాఖ అధికారులే. ఈ వివాహం తర్వాత ఆయన మైనింగ్ కార్యాలయాలు, ఆఫీసుల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆ సమయంలో ఆ శాఖ అధికారులు సధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తలబాదుకున్నట్లు తెలిసింది. తన కుమార్తె బ్రహ్మణి పెళ్లి ఖర్చుకు సంబంధించి ప్రతి పైసాకు లెక్క ఉందని, ఆస్తులు కుదవ పెట్టి డబ్బు సమకూర్చానని చెబుతూ వచ్చిన గాలి జనార్ధన్‌రెడ్డి ఇప్పుడు ఐటీ శాఖ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా... గాలి జనార్ధన్ రెడ్డికి ఐటీ అధికారులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఆయనతో పాటు.. ఆయన ఆడిటర్లు నిమగ్నమైవున్నారు. కాగా, గాలి తన కుమార్తె పెళ్లికి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఐటీ అధికారుల ముఖ్య ప్రశ్నలను పరిశీలిస్తే.. 
 
* పెళ్ళికి ముందు జరిగిన ఖర్చు ఎంత? తర్వాతి ఖర్చు ఎంత? వివరాలివ్వండి?
* పెళ్లికి ఎంత మంది హాజరయ్యారు?
* ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కు ఎంత ఇచ్చారు?
* బౌన్సర్‌లకు ఎంత చెల్లించారు?
* రవాణా, వసతి సదుపాయాలు, వినోద కార్యక్రమాల ఖర్చు ఎంత?
* ప్యాలెస్‌లో భారీగా నిర్మించిన కళాఖండాలకు ఎంతైంది?
* పెళ్లి పత్రికల ఖర్చెంత?
* బ్రహ్మణికి కొనుగోలు చేసిన ఆభరణాలు, ఖరీదైన వస్త్రాల వివరాలు ఇవ్వండి?
* పెళ్లి కోసం ఖరీదైన వస్తువులు ఎక్కడ కొన్నారు? ఎంత చెల్లించారు?
* పెళ్లి ఖర్చులను ఏయే ఖాతాల ద్వారా చేశారు? క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లిస్తే, ఆ వివరాలు ఇవ్వండి?
* పెళ్లిలో బంధుమిత్రులకు ఇచ్చిన కానుకల వివరాలు సమర్పించండి?
వీటన్నింటికీ గాలి జనార్ధన్‌రెడ్డి ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ఐటీ అధికారులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూట్యూబ్‍‌లో ఓ స్టంట్ వీడియో చూసి.... ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..