Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్కెట్ ఎలా ఇవ్వరో చూస్తా.. నువ్వు ఎలా ప్లేన్ ఎక్కుతావో మేమూ చూస్తాం. పంతం నీదీ నాదీ సై...

ఎయిర్ ఇండియా తన ఇంటి పిల్లి అనుకుని హద్దులు మీరి ప్రవర్తించిన ఆ ఎంపీ ఆరోజునుంచీ అవమానాల మీద అవమానాలు పొందుతూనే ఉన్నాడు. బిజినెస్ క్లాసులో సీటు ఇవ్వలేదని కోపించి సీనియర్ మేనేజర్‌పై చెయ్యి చేసుకుని 25 చెప్పుదెబ్బలు కొట్టిన ఆ అహంకారి ఎంపీని దేశంలోని అన్

Advertiesment
Ravindra Gaikwad
హైదరాబాద్ , ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (03:02 IST)
నాలుగ్గోడల మధ్య వేసి బాదితే పిల్లి సైతం తిరగబడుతుందని సామెత. ఎయిర్ ఇండియా తన ఇంటి పిల్లి అనుకుని హద్దులు మీరి ప్రవర్తించిన ఆ ఎంపీ ఆరోజునుంచీ అవమానాల మీద అవమానాలు పొందుతూనే ఉన్నాడు. బిజినెస్ క్లాసులో సీటు ఇవ్వలేదని కోపించి సీనియర్ మేనేజర్‌పై చెయ్యి చేసుకుని 25 చెప్పుదెబ్బలు కొట్టిన ఆ అహంకారి ఎంపీని దేశంలోని అన్ని విమానాశ్రయాలు వెలి వేస్తూనే ఉన్నాయి. ఇది తన పరువుకు సంబంధించిన సమస్య కావడంతో ఎలాగైనా సరే ఏదో విమానం టిక్కెట్టు సంపాదించి వార్తల్లో నిలబడాలనుకున్న శివసేన ఎంపీకీ మళ్లీ శృంగభంగం అయింది. 
 
ఎయిరిండియా ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ జీవితంలో మర్చిపోలేని అవమానాల బారిన పడుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఐదుసార్లు విమానం ఎక్కేందుకు ప్రయత్నించి భంగపడిన గైక్వాడ్‌ తాజాగా ప్రైవేటు విమానంలోనూ తిరస్కారానికి గురయ్యారు. ఈసారి ఆయన ప్రైవేటు విమానాయాన సంస్థ స్పైస్‌జెట్‌లో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. 
 
తక్కువ ధరకు అందుబాటులో ఉండే స్పైస్‌జెట్‌లో సోమవారం పుణె నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకోవాలనుకున్నారు. శనివారం రూ. 4,504 ధర కలిగిన టికెట్‌ను కొనేందుకు ఆయన ప్రయత్నించగా.. ప్రయాణికుడి పేరును 'రవీంద్ర గైక్వాడ్‌' అని చెప్పడంతోనే స్పైస్‌జెట్ వెంటనే టికెట్‌ బుకింగ్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని స్పైస్‌జెట్‌ ప్రతినిధి తెలిపారు.
 
తన విమానంలో 60 ఏళ్ల మేనేజర్‌పై దాడి చేసి దురుసుగా ప్రవర్తించిన గైక్వాడ్‌కు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియా ఇప్పటికే పలుమార్లు షాక్‌ ఇచ్చింది. ఎంపీ గైక్వాడ్‌ ఐదుసార్లు ఎయిరిండియా టికెట్‌ బుక్‌ చేసేందుకు ప్రయత్నించగా.. అన్నిసార్లు నిరాకరించింది. విమానంలో ప్రయాణించేందుకు అనుమతించకపోవడంతో ఆయన ఇప్పటికే రైలులో, కారులో ప్రయాణాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
 
అందుకే పెద్దలు ఊరికే అనలేదు.. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని. అడుసు తొక్కనేల కాలు కడగనేలా.. అని మరోసామెత. నువ్వు ఒక పెద్ద తప్పు చేసి ఇతరులు నీపట్ల ఏ తప్పూ చేయకూడదంటే ఎలా. వాళ్లకూ కోపం, తాపం, రోషం, పాశం అన్నీ ఉంటాయి కదా. న్యాయ పరంగా ఈ విషయం ఒక కొలిక్కి వచ్చేంతవరకు శివసేన ఎంపీ కొన్నాళ్లు విమాన టిక్కెట్ కోసం ప్రయత్నాలు మానుకుని మౌనం పాటిస్తే మంచిదేమో. కొంత కాలం పోతే వారే జాలిపడి దయదల్చి మళ్లీ టికెట్ ఇస్తారు కదా.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ మహా నేతలకూ టీడీపీ సభ్యత్వమే... జగన్‌ ఏం పాపం చేశారు.. తనకూ ఇచ్చేస్తే పోలా!