Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షీనా బోరా హత్య కేసు : ఇంద్రాణి అవయవదానం.. ఆస్తిలో 75 శాతం విరాళం

దేశంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ హత్యల్లో షీనా బోరా హత్య కేసు ఒకటి. కన్నతల్లే కన్నబిడ్డను చంపేసింది. ఈ హత్య కేసు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణ

Advertiesment
Sheena Bora Murder
, శనివారం, 24 డిశెంబరు 2016 (09:14 IST)
దేశంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ హత్యల్లో షీనా బోరా హత్య కేసు ఒకటి. కన్నతల్లే కన్నబిడ్డను చంపేసింది. ఈ హత్య కేసు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా తన అవయవాలను దానం చేశారు. అంతేకాకుండా, తన ఆస్తిలో 75 శాతం విరాళంగా కూడా ప్రకటించారు. 
 
కుమార్తె హత్య కేసులో ప్రధాన నిందితురాలు కూడా. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమెపై విచారణ జరుగుతోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఆమె గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట రెండు విజ్ఞప్తులు చేశారు. తన ఆస్తిలో 75 శాతాన్ని, తన అవయవాలను దానం చేస్తానని జడ్జి హెచ్‌ఎస్‌ మహాజన్‌కు చెప్పారు. ఈ విషయం తెలిసి న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. 
 
ఈ సందర్భంగా ఇంద్రాణి మాట్లాడుతూ.. తాను జైలులో సాదాసీదా జీవితం గడిపాననీ, ఖైదీల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ఆస్తులు విరాళంగా ఇవ్వడానికి కోర్టు అనుమతి అవసరం లేదని, అది మీ ఇష్టమని అన్నారు. 
 
'రేపు తీర్పు ఎలా వస్తుందో నాకు తెలియదు. నాకు ఉరి శిక్ష పడొచ్చు, లేదా కోర్టు జీవితఖైదు వేయొచ్చు. లేదా నిర్దోషిగా విడుదల కావొచ్చు. అందుకే నా అవయవాలను.. ఆస్తిని దానం చేస్తున్నాను' అని ఇంద్రాణి పేర్కొన్నారు. ఆమె దానం చేసే మొత్తంలో సగాన్ని ఇస్కాన్‌కూ, మిగిలిన మొత్తాన్ని స్త్రీ, బాలల సంక్షేమ సంస్థకు విరాళంగా ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రి కుర్చీపై చిన్నమ్మ కన్ను.. సీఎం పన్నీర్‌సెల్వంకు పదవీగండం!