Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఖైదీలు తలలు గోడలకేసి కొట్టుకున్నారు... రక్తం ఏరులై పారింది.. ఎక్కడ?

మన దేశంలోని పేరుమోసిన జైళ్లలో తీహార్ జైలు ఒకటి. ఈ జైల్లో కరుడుగట్టిన నేరస్థులతో పాటు పెద్ద నేరాలకు పాల్పడిన రాజకీయ నేతలు సైతం ఉంటారు. అయితే, ఈ జైలులోని ఖైదీల్లో కొందరి వింత ప్రవర్తన కారణంగా ఈ జైలు వార

Advertiesment
ఆ ఖైదీలు తలలు గోడలకేసి కొట్టుకున్నారు... రక్తం ఏరులై పారింది.. ఎక్కడ?
, శుక్రవారం, 3 మార్చి 2017 (12:29 IST)
మన దేశంలోని పేరుమోసిన జైళ్లలో తీహార్ జైలు ఒకటి. ఈ జైల్లో కరుడుగట్టిన నేరస్థులతో పాటు పెద్ద నేరాలకు పాల్పడిన రాజకీయ నేతలు సైతం ఉంటారు. అయితే, ఈ జైలులోని ఖైదీల్లో కొందరి వింత ప్రవర్తన కారణంగా ఈ జైలు వార్తలకెక్కింది. ఒక సెల్‌లోని ఖైదీలంతా గోడకేసి తలలు బాదుకోవడంతో వారి తలన్నీ పగిలిపోయాయి. తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
ఇదే అంశంపై జైళ్ల విభాగం డీజీ సుదీర్ యాదవ్ స్పందిస్తూ... స్పెషల్ సెక్యురిటీ సెల్‌లో ఖైదీలు వారి తలలు వారే గోడలకు మోదుకోవడంతో 11మందికి గాయాలయ్యాయని, సెల్‌లోని అందరినీ ఓకేసారి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అధికారులు నిరాకరించడంతో ఖైదీలు ఈ దారుణానికి దిగినట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగినట్టు తెలిపారు. 
 
తొలుత ఓ ఖైదీ తనకు బాగోలేదనీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని గార్డును పిలిచి అడిగాడు. దీంతో వెంటనే మిగతా గార్డులు ఇతర సిబ్బంది తాళాలు తీసుకుని వచ్చారు. ఇంతలో మిగతా ఖైదీలు కూడా తమకు బాగోలేదనీ తమను కూడా సెల్ బయటకు తీసుకెళ్లాలని అడిగారు. భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అందరినీ ఒకేసారి తీసుకెళ్లడం సాధ్యం కాదని సిబ్బంది వారితో చెప్పారు. దీంతో వారంతా తలలు గోడలకేసి కొట్టుకోవడం మొదలుపెట్టారని డీజీ వెల్లడించారు. గాయపడిన వారిని సిబ్బంది హుటాహుటిన సమీపంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మార్కెట్లోకి ఫీచర్ ఫోన్ 3310.. దేశంలో లేదా చైనాలో తయారీ