Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ చనిపోయిన అర్థరాత్రే అర్థమైంది.. నా వైపు 129 ఎమ్మెల్యేలున్నారు జాగ్రత్త: శశికళ

దివంగత సీఎం జయలలిత మరణించిన నాడే ఆ రోజు అర్థరాత్రే తనకు పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తనకు అర్థమైందని.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ చనిపోయిన

అమ్మ చనిపోయిన అర్థరాత్రే అర్థమైంది.. నా వైపు 129 ఎమ్మెల్యేలున్నారు జాగ్రత్త: శశికళ
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (15:20 IST)
దివంగత సీఎం జయలలిత మరణించిన నాడే ఆ రోజు అర్థరాత్రే తనకు పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తనకు అర్థమైందని.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ చనిపోయిన అర్థరాత్రి తాను ఐదుగురు మంత్రులతో మాట్లాడానని.. వెంటనే ఒక కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం ఉందని నిర్ణయించినట్లు చిన్నమ్మ చెప్పారు. 
 
నూతన మంత్రివర్గం అవసరమైనప్పటికీ... పన్నీర్ సెల్వం సహా ప్రభుత్వంలో, మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేపట్టదల్చుకోలేదు. అయితే పన్నీర్ సెల్వం నమ్మక ద్రోహం చేశారని.. ఆయన మానసిన పరిస్థితి బాగోలేదన్నారు. ఇంకా అన్నాడీఎంకే పార్టీలో చీలిక తెచ్చేందుకు.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి బీజేపీ, డీఎంకే కారణమని శశికళ విమర్శించారు. 
 
సోమవారం శశికళ ఏఐఏడీఎంకే కార్యకర్తలతో పాటు మీడియాతో మాట్లాడుతూ... అమ్మ చనిపోయిన అర్థరాత్రి గవర్నర్‌తో సమావేశమయ్యేందుకు తాను అపాయింట్‌మెంట్ కోరానని చెప్పారు. అమ్మ ఆశయాలను ముందుకు నడిపించడమే లక్ష్యంగా.. పనిచేశానన్నారు. కానీ అమ్మ మృతి చెందిన బాధలో పదవి తనకు పెద్దగా అనిపించలేదని.. ఆమె వెంటే ఉండాలనే ఉద్దేశంతోనే అప్పట్లో పన్నీరును సీఎంగా ప్రకటించడం జరిగిందన్నారు.
 
తనకు అధికార కాంక్ష లేదనీ... తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం తానే స్వయంగా బాధ్యతలు అప్పజెప్పానని పేర్కొన్నారు. కాని ఆయన మాత్రం నీచమైన రాజకీయాలు చేస్తూ పార్టీని చీల్చేందుకు డీఎంకేతో చేతులు కలిపారని తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. పన్నీర్ మానసిక స్థితి బాగోలేదనీ... ఆయనను ఎలా దారికి తీసుకురావాలో తనకు తెలుసునని శశికళ పేర్కొన్నారు. తన వైపు 129 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని చెప్పారు. చేతికి అంటిన దుమ్మును దులిపినట్లు పన్నీర్ సెల్వంను చెత్తకుండీల్లో పారేస్తానని శశికళ ఫైర్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ మీద కోపం.. అర్థరాత్రి పూట రోడ్డుపైకి వచ్చిన యువతి.. పోలీసులతో సెల్ఫీ