Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డెన్ బే రెసార్ట్‌లో చిన్నమ్మ నిద్రలేని రాత్రి.. ఇక రాజకీయ సీన్లొద్దు.. కట్టిపెట్టండి...పనేదో చూడండి..

అధికార పీఠం కోసం చిన్నమ్మ శశికళ చేసిన ప్రయత్నాలకు సుప్రీం కోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. మరోవైపు పన్నీర్ సెల్వం ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంల

Advertiesment
గోల్డెన్ బే రెసార్ట్‌లో చిన్నమ్మ నిద్రలేని రాత్రి.. ఇక రాజకీయ సీన్లొద్దు.. కట్టిపెట్టండి...పనేదో చూడండి..
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (11:54 IST)
అధికార పీఠం కోసం చిన్నమ్మ శశికళ చేసిన ప్రయత్నాలకు సుప్రీం కోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. మరోవైపు పన్నీర్ సెల్వం ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ తన వర్గం నుంచి పన్నీరుకు పోటీగా నేతను అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సి వుంది.

ఓవైపు ఊరిస్తోన్న అధికార పీఠం.. మరోవైపు జైలు ఊచలు.. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఆలోచనలు సోమవారం రాత్రి నుంచి వీటి చుట్టే తిరిగాయి. అక్రమాస్తుల కేసులో నేటి ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం.. శశికళను దోషిగా ప్రకటించడంతో ప్రస్తుతం ఆమె ముందు గాఢాంధకారం అలుముకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం రాత్రంతా చిన్నమ్మ కంట నిద్ర లేదు. 
 
కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందా? ప్రతికూలంగా వస్తుందా? అన్న ఆందోళన, ఒకలాంటి బెంగ ఆమెలో కనిపించినట్టు ఆమె తరపు వర్గాలు తెలిపాయి. సుప్రీం తీర్పు సానుకూలంగా వచ్చేలా పలువురు దేవతలను శశికళ వేడుకున్నట్టుగా చెబుతున్నారు. అలాగే ఒకవేళ తాను గనుక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తితే పగ్గాలు మాత్రం పన్నీర్ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఆమె రాత్రంతా వ్యూహాలు రచించినట్టు సమాచారం.

అయితే ప్రజలు మాత్రం ఇక శశికళ కథను పక్కనబెట్టి.. రాజకీయ సీన్లకు తెరదించి ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించాలని సోషల్ మీడియాలో ప్రజలు సూచిస్తున్నారు. పన్నీర్ సెల్వంను హీరోను చేసిన నెటిజన్లు.. త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుని.. ప్రజా సమస్యల పరిష్కారానికి సమయాత్తమవ్వాలని సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#dacase.... సాయంత్రంలోపు లొంగిపోండి.. శశికళకు సుప్రీం ఆర్డర్ : పన్నీర్ ఇంటికి ఎమ్మెల్యేల క్యూ...