Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజాబ్‌లో విపత్తు ఉపశమనం- సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

Advertiesment
care for punjab

ఐవీఆర్

, శనివారం, 4 అక్టోబరు 2025 (19:35 IST)
ఇటీవలి వరదల వల్ల ప్రభావితమైన కస్టమర్లు, కమ్యూనిటీలకు సకాలంలో సహాయం అందించడానికి సామ్‌సంగ్ పంజాబ్‌లో తన ప్రత్యేక విపత్తు ఉపశమనం- సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రాథమిక ఉపకరణాలు, అత్యవసర కిట్‌లతో కూడిన సంరక్షణ శిబిరాల ద్వారా విపత్తు ప్రభావిత ప్రాంతాలలో అవసరమైన గృహ సేవలను అందించడానికి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా రూపొందించారు. శ్రీనగర్‌లోని వ్యాలీ ఆఫ్ హోప్(2014) నుండి కేర్ ఫర్ కేరళ(2018), కేర్ ఫర్ మహారాష్ట్ర(2019) వరకు గత కొన్నేళ్లుగా వివిధ కార్యక్రమాల ద్వారా క్లిష్ట సమయాల్లో ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సామ్‌సంగ్ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాలు వేలాది మందికి ప్రాథమిక సౌకర్యాలను పొందడంలో, వారి జీవితాలను పునర్నిర్మిం చడంలో, సవాలుతో కూడిన పరిస్థితులలో ఆశను కనుగొనడంలో సహాయపడ్డాయి.
 
ప్రతి అవసరానికి ఒక కేర్ క్యాంప్
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో ఇటీవల వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. అక్కడ సామ్‌సంగ్ ఇప్ప టికే తన కాంటాక్ట్ సెంటర్లు, సర్వీస్ సెంటర్ల ద్వారా సహాయం కోసం అభ్యర్థనలను స్వీకరించడం ప్రారంభించింది. ప్రజలు నిరంతరం మద్దతు కోసం శిబిరానికి చేరుకుంటున్నారు. స్థానిక ప్రకటనలు, కమ్యూనికేషన్ సమీపంలోని గ్రామాలకు వ్యాపించడంతో వీరి సంఖ్య మరింత పెరుగనుందని భావిస్తున్నారు.
 
చాలా అభ్యర్థనలు నీటిలో మునిగిపోయిన స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లకు సంబంధించినవి... ఇవన్నీ కూడా కుటుంబాలు ప్రతిరోజూ ఆధారపడే ముఖ్యమైన ఉపకరణాలు. త్వరిత ఉపశమనం కోసం, సామ్‌ సంగ్ తన కస్టమర్ సర్వీస్ బృందాలను నేరుగా క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి నియమించింది.
 
ఈ శిబిరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అధీకృత సేవా కేంద్రాలలో పోస్టర్లను బ్రాంచ్ ఆఫీసులు ఉంచాయి. సామ్‌సంగ్ మెంబర్స్ పైన బ్యానర్లు ఏర్పాటు చేయబడ్డాయి, సోషల్ మీడియా పోస్ట్‌లు క్రమంగా పెరుగుతున్నాయి. పంజాబ్‌లోని ప్రభావిత గ్రామాలలో స్థానిక ప్రకటనల వాహనాలను ఏర్పాటు చేశారు. ఇతర అత్యవసర పరిస్థితులకు సంసిద్ధతను నిర్ధారించడానికి, సామ్‌సంగ్ పంజాబ్‌తో పాటు దిల్లీ, ముంబై, కోల్‌‌కతా, చెన్నై అనే నాలుగు ప్రధాన నగరాలలో పెద్ద టెంట్లు, అవసరమైన సహాయ కిట్‌లను ముందుగానే ఉంచింది. ఈ మొబైల్ కేర్ సెంటర్లు విపత్తు ప్రభావిత ప్రాంతాలలో యాక్టివేట్ చేయబడతాయి.
 
సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లతో దుస్తులు ఉతుక్కునే సదుపాయాలు.
సామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్లను ఉపయోగించి సురక్షితంగా ఆహార నిల్వ, ఔషధాల కూలింగ్.
సామ్‌సంగ్ మైక్రోవేవ్ ఓవెన్లతో వేడి భోజనం మరియు తక్షణ ఆహారాన్ని వేడి చేయడం
నిరంతర నీటి సరఫరాకు మద్దతుగా ట్యాంకులు, పంపులు, జనరేటర్లతో తాగునీటి సదుపాయం.
 
ప్రతి శిబిరంలో టేబుళ్లు, కుర్చీలు, డ్రైయింగ్ రాక్‌లు, సబ్బులు, డిటర్జెంట్లు ఉంటాయి. భద్రతా కిట్‌లలో రిఫ్లెక్టర్ వెస్ట్‌లు, గ్లోవ్‌లు, క్యాప్‌లు ఉన్నాయి. ఇవి కస్టమర్లు, సిబ్బంది ఇద్దరికీ సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి సహాయపడతాయి.
 
బాధ్యతకు మించి శ్రద్ధ వహించడం
విపత్తులలో దెబ్బతిన్న ఉపకరణాల కారణంగా సామ్‌సంగ్ తరచుగా సర్వీస్ కాల్స్‌లో 30% వరకు పెరుగు దలను ఎదుర్కొంటుంది. ఫీల్డ్-లెవల్ వాయిస్-ఆఫ్-కస్టమర్ (VOC) ఫీడ్‌బ్యాక్ ద్వారా మార్గనిర్దేశంతో, సామ్‌ సంగ్ సేవా బృందాలు పరిస్థితిని వెంటనే అంచనా వేస్తాయి. ప్రభావిత ప్రజలను చేరుకోవడానికి విపత్తు ఉపశ మనం & సంరక్షణ కార్యక్రమాన్ని సమీకరిస్తాయి. విపత్తులు ఇళ్లను కూల్చవచ్చు, కానీ అవి కస్టమర్లు, భాగస్వాములు, విస్తృత సమాజం పట్ల సామ్‌సంగ్ నిబద్ధతను కూల్చలేవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hyderabad: డల్లాస్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి హత్య.. కాల్చి చంపేశారు