Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లధనానికి చెక్.. నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్... మోడీకి ప్రశంసల వెల్లువ..

నల్లబాబులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చావుదెబ్బ కొట్టారు. నల్లధన కుబేరులపై సర్జికల్ స్ట్రైక్‌లాంటి దాడి చేశారు. దీంతో మోడీపై ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్‌మనీపై తొలి నుంచి మోడీ సర్కారు కఠిన చర

Advertiesment
నల్లధనానికి చెక్.. నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్... మోడీకి ప్రశంసల వెల్లువ..
, బుధవారం, 9 నవంబరు 2016 (09:27 IST)
నల్లబాబులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చావుదెబ్బ కొట్టారు. నల్లధన కుబేరులపై సర్జికల్ స్ట్రైక్‌లాంటి దాడి చేశారు. దీంతో మోడీపై ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్‌మనీపై తొలి నుంచి మోడీ సర్కారు కఠిన చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే సిట్ ఏర్పాటు చేశారు. నల్లధనంపై పోరు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు చేసిందేమీలేదని విపక్షాలు చేసిన విమర్శలకు మోడీ ఘాటుగా సమాధానం ఇచ్చారు.  
 
బినామీ నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అలాగే ఆదాయ వెల్లడి పథకంతో రూ.65 వేల కోట్లు బయటికి తెచ్చారు. అప్పటికీ బయటపడని నల్లబాబులపై నోట్ల రద్దుతో చావు దెబ్బ కొట్టారు. రెండున్నరేళ్లు గడిచినా నల్లధనం నియంత్రణకు మోడీ సర్కారు చేసింది ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ.. పగ్గాలు చేపట్టిన తొలినాళ్ల నుంచీ ప్రధాని మోడీ అదే పనిలోనే ఉన్నారు. 
 
ఇందులోభాగంగానే మోడీ సర్కారు నల్లబాబులకు మంచి ఛాన్సు కూడా ఇచ్చింది. బినామీ నిరోధక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ వ్యవస్థను నాశనం చేయడానికి నడుం బిగించింది. ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌) ద్వారా మరో అవకాశాన్ని ఇచ్చింది. అలాంటివారు ఇనాళ్లుగా లెక్కల్లో చూపని ఆస్తుల వివరాలు వెల్లడించడానికి కొంత సమయం ఇచ్చింది.
 
నల్లధనం కలిగిన వాళ్లు పన్ను చెల్లించి తెల్లధనంగా మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. అంతేగాకుండా.. మన దేశంలోని బడాబాబులు విదేశాల్లో పోగేసుకున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని మోడీ అనేక విదేశీ యాత్రలను వినియోగించుకున్నారు. వివిధ అంతర్జాతీయ వేదికలపై నల్లధనం వల్ల ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. నల్లధనం అరికట్టడానికి అంతర్జాతీయ సమాజం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
 
తాజా నిర్ణయం పెద్ద నోట్ల రద్దుతో చావు దెబ్బ కొట్టినట్టయింది. నిజానికి ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి జైట్లీ, ప్రధాని మోడీ పరోక్షంగా ఎన్నో సంకేతాలిచ్చారు. దీంతో నల్లకుబేరులపై మోడీ సరైన దెబ్బేశారని.. బ్లాక్ మనీ భరతం పట్టేందుకు మోడీ సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుర్తింపు కార్డులు లేకుంటే రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి చెల్లదు