Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Advertiesment
girl - train

ఠాగూర్

, బుధవారం, 2 జులై 2025 (11:22 IST)
ఫ్లాట్ ఫామ్ నుంచి కదిలిన రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి.. పట్టుకోల్పోయి రైలుకు, ఫ్లాట్ ఫామ్‌ మధ్యలో పడిపోయింది. ఆ యువతిని ఓ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఈ స్టేషనులో కదులుతున్న రైలులోకి ఓ యువతి పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ యువతి బోగీలోకి ఎక్కే సమయంలో కాలు జారడంతో పట్టుకోల్పోయి, కిందపడిపోయింది. 
 
దీంతో ఆ యువతిని పోలీస్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆ  కానిస్టేబుల్‌ను ఇతర రైల్వే ప్రయాణికులతో పాటు వీడియోను చూసిన నెటిజన్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య