Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికపై అత్యాచారం చేశాడు.. యావజ్జీవ ఖైదీ అయ్యాడు.. కానీ విడుదలయ్యాడు ఎలా?

బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దుండగులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా బాలికపై అత్యాచారానికి పాల్పడి యావజ్జీవ శిక్ష అనుభవించే ఓ ఖైదీని నిర్దోషి అంటూ మద్రాసు హైకోర్టు మదురై శా

Advertiesment
rape case lifetime accust released in tamil nadu
, మంగళవారం, 26 జులై 2016 (09:20 IST)
బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దుండగులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా బాలికపై అత్యాచారానికి పాల్పడి యావజ్జీవ శిక్ష అనుభవించే ఓ ఖైదీని నిర్దోషి అంటూ మద్రాసు హైకోర్టు మదురై శాఖ ప్రకటించి విడుదల కూడా చేసింది. మహిళలపై దురాగతాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు లేకపోవడంతో ఇప్పటికే వాటిని సవరించాలని డిమాండ్ పెరిగిపోతుంటే.. నేరస్థులు చట్టంలో ఉన్న లొసుగులతో హ్యాపీగా బయటికి వచ్చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే పుదుకోట జిల్లా గంధర్వకోటకు చెందిన చెల్లప్పన అదే ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2013లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన పుదుకోట మహిళా కోర్టు చెల్లప్పనకు యావజ్జీవ శిక్ష  విధిస్తూ తీర్పు కూడా వెలువరించింది. కానీ మహిళా కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ చెల్లప్పన్ మదురై హైకోర్టు శాఖలో అప్పీలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. 
 
ఇరు తరపు వాదనల అనంతరం న్యాయమూర్తులు చెల్లప్పన్‌పై మోపబడిన నేరాలకు ఆధారాలు సమర్పించడంలో పోలీసులు విఫలమయ్యారని.. దీంతో ఆతడిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆధారాలు లేకపోవడంతో యావజ్జీవ ఖైదీ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ (సీఎం జయలలిత)ను పేరు పెట్టి పిలవకూడదు.. అంతే.. ఇది నా ఆదేశం : తమిళనాడు అసెంబ్లీ స్పీకర్