Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

ఆ విషయంలో మీకు అండగా నేనున్నానన్న రజినీకాంత్

Advertiesment
Rajinkanth
, శుక్రవారం, 6 మార్చి 2020 (22:25 IST)
రాజకీయాల్లోకి వస్తానంటూనే రాజకీయాల్లోకి రారు. కానీ సినీరంగంలో ఉంటూనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మాత్రం సహించరు. దాన్ని ప్రశ్నిస్తారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎవరు ఆయనన్నది. సూపర్ స్టార్ రజినీకాంత్. దక్షిణాది సూపర్ స్టార్ ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించడానికి సిద్థమయ్యారు.
 
గత కొన్నిరోజులుగా ఎన్.ఆర్.సి, సి.ఎ.ఎ అంశం కాస్త తీవ్రస్థాయిలో ముస్లింలలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. ముస్లింలు రోడ్డపైకి వచ్చి శాంతియుత నిరసన ప్రదర్సన చేస్తున్నా పోలీసులు మాత్రం వారికి లాఠీలను రుచిచూపిస్తున్నారు.
 
తమిళనాడు రాష్ట్రంలో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే పలువురు పూర్తిస్థాయిలో మద్ధతు తెలిపారు. ముఖ్యంగా డిఎంకే పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెన్నై వీధుల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే సినీప్రముఖులు మాత్రం పూర్తిస్థాయిలో మద్ధతు మాత్రం ప్రకటించలేదు. 
 
అయితే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ముస్లింలకు అండగా నిలబడ్డారు. మీకు బాధ కలిగినా..మిమ్మల్ని ఇబ్బంది కలిగేలా చేసినా నేను మీతో ఉంటాం. మీకు అండగా నేను పోరాడుతానంటూ ముస్లింలకు తన పూర్తి మద్ధతును తెలిపారు రజినీకాంత్. దీంతో ముస్లిం సంఘాలు రజినీకాంత్ ను అభినందిస్తున్నాయి. అండగా నిలబడినందుకు కృతజ్ఙతలు చెబుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరైనా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి ఇళ్లపై ఐటీ రైడ్స్ లేకుంటే ఎసిబి రైడ్స్ లాంటివి కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హస్త కళాకారుల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు: హిమాన్హు శుక్లా