Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెట్లు నరకడాన్ని అడ్డుకున్నదనీ పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ?

భూతాపాన్ని తగ్గించేందుకు ఇంటికో మొక్కను నాటాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ, కొందరు గ్రామస్థులు తమతమ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. పైగా చెట్ల నరకివేతను అడ్

Advertiesment
Rajasthan
, సోమవారం, 27 మార్చి 2017 (14:26 IST)
భూతాపాన్ని తగ్గించేందుకు ఇంటికో మొక్కను నాటాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ, కొందరు గ్రామస్థులు తమతమ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. పైగా చెట్ల నరకివేతను అడ్డుకున్నా లేక ప్రశ్నించినా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. తాజాగా ఓ మహిళ చెట్ల నరికివేతను అడ్డుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులంతా కలిసి ఆమెను సజీవదహనం చేశారు. 
 
ఈ దారుణం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... జోధ్‌పూర్‌లోని ఓ గ్రామంలో ఆదివారం రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. లలిత అనే మహిళకు చెందిన పొలంలో చెట్లు అడ్డుగా వచ్చాయి. వాటిని తొలగిస్తామని చెప్పగా.. లలిత అందుకు నిరాకరించింది. చెట్ల నరికివేతకు లలిత ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. 
 
అంతటితో ఆగకుండా.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లలిత.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్లో గ్రామ సర్పంచ్‌ రణ్‌వీర్‌ సింగ్‌‌తో పాటు.. 10 మంది ఉన్నారు. వీరందరిపై కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై జయదుర్గ ఆలయంలో ప్రసాదంగా బర్గర్లు, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు..!