Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్కె తీర్చాలంటూ బాలుడిని వేధించిన లేడీ హెచ్ఎం... 'ట్యూషన్' పేరుతో ఇంట్లో ఉంచుకునీ...

పంజాబ్ రాష్ట్రంలో ఓ ఉమెన్ టీచర్ ఉపాధ్యాయవృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. కొవ్వుతో మదమెక్కి.. కామంతో కళ్లుమూసుకుని పోయిన.. ఈ లేడీ హెడ్‌మిస్ట్రెస్... తన వద్ద చదువుకునే అభంశుభం తెలియని ఓ బాలుడిని

Advertiesment
Punjab
, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (14:53 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ ఉమెన్ టీచర్ ఉపాధ్యాయవృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. కొవ్వుతో మదమెక్కి.. కామంతో కళ్లుమూసుకుని పోయిన.. ఈ లేడీ హెడ్‌మిస్ట్రెస్... తన వద్ద చదువుకునే అభంశుభం తెలియని ఓ బాలుడిని లైంగికకోర్కె తీర్చాలంటూ వేధించింది. ఇది స్థానికంగా సంచలనం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలోని ఘనోర్ అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఓ మహిళ టీచర్ ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇదే పాఠశాలలో చదువుకునే 17 యేళ్ళ బాలుడిని లోబరుచుకుని తన కోర్కె తీర్చుకోవాలని భావించింది. ఇందులోభాగంగా, ట్యూషన్ చెపుతానంటూ ఆ బాలుడిని ఇంటికి పిలిపించుకుని రాత్రిపూట ఇంట్లోనే ఉంచుకునేది. అతనికి కోరినవి తీసిస్తూ... రుచికరమైన చిరుతిండ్లు పెడుతూ తన వలలో వేసుకునేందుకు ప్రయత్నించింది. 
 
ఆ తర్వాత తనకు ఒంటరిగా పనుకోవడం భయమని చెప్పి... తన మంచంపైనే పడుకోబెట్టుకుని... తన కోర్కె తీర్చుకునేలా ఆ బాలుడిని రెచ్చగొట్టింది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ బాలుడు.. టీచరమ్మ ఇంట్లో తాను అనుభవిస్తున్న వేధింపులను తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో తన కుమారుడితో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. 
 
దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన పాఠశాల విద్యా కార్యదర్శి కిషన్ కుమార్, సర్కిల్ విద్యాధికారిణి నిషా జలోటాలు బాలుడిని లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ప్రధానోపాధ్యాయురాలు రెండేళ్ల క్రితం మరో స్కూలు బాలుడితో కలిసి నృత్యం చేస్తూ వెలువడిన వీడియో అప్పట్లో సంచలనం రేపిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. కాగా, పాఠశాల బాలుడి పట్ల ప్రధానోపాధ్యాయురాలి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండేదని తోటి ఉపాధ్యాయులు చెప్పడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను 'పెద్ద' కాపును - వైసిపి నుంచే పోటీ చేస్తా - పవన్‌కు హేమ షాకింగ్...