Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచానికి కాళ్లు చేతులు కట్టేసి పెర్‌ఫ్యూమ్ డిజైనర్ హత్య

గోవాలో దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రముఖ పెర్‌ఫ్యూమ్ డిజైనర్ మోనికా గుర్డే (39) హ‌త్య‌కు గురైంది. గోవాలోని సాంగోల్డా గ్రామంలో ఉన్న సొంతింట్లోనే ఆమె శ‌వ‌మై కనిపించింది. ఆమె శ‌రీరంపై దుస్తులు లేవు. మంచాన

Advertiesment
మంచానికి కాళ్లు చేతులు కట్టేసి పెర్‌ఫ్యూమ్ డిజైనర్ హత్య
, శనివారం, 8 అక్టోబరు 2016 (12:22 IST)
గోవాలో దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రముఖ పెర్‌ఫ్యూమ్ డిజైనర్ మోనికా గుర్డే (39) హ‌త్య‌కు గురైంది. గోవాలోని సాంగోల్డా గ్రామంలో ఉన్న సొంతింట్లోనే ఆమె శ‌వ‌మై కనిపించింది. ఆమె శ‌రీరంపై దుస్తులు లేవు. మంచానికి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి ఉన్నాయి. మోనికాను అత్యాచారం చేసి ఆ త‌ర్వాత దారుణంగా హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆమె మెడ‌పై చేతి అచ్చులు ఉన్నాయ‌ని, దాని ఆధారంగా ఆమె హ‌త్య‌కు గురైన‌ట్లు తెలుస్తోంద‌ని పోలీసు అధికారి తెలిపారు. గోవాలోని ఫేమ‌స్ క‌నాల్‌ఘాట్ బీచ్‌కు ద‌గ్గ‌ర్లోనే సాంగోల్డా ఉంది. మోనికా కొన్నేళ్లుగా సుగంధ ద్రవ్యం ప‌రిమ‌ళాల వ్యాపారం చేస్తోంది. 
 
యూరోప్‌, న్యూయార్క్ ప్రాజెక్టుల‌తో ఆమెకు లింకులున్నాయ‌ని ఆమె వెబ్‌సైట్ ద్వారా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్న నాయకులను విషమిచ్చి చంపండి: ఉగ్రదాడి బాధితులు