Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతి ఒక్కరికి ఉచిత వాక్సిన్ : 23న కొత్త వ్యాక్సిన్ విధానం : మోడీ వెల్లడి

ప్రతి ఒక్కరికి ఉచిత వాక్సిన్ : 23న కొత్త వ్యాక్సిన్ విధానం : మోడీ వెల్లడి
, సోమవారం, 7 జూన్ 2021 (18:14 IST)
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ప్రసంగించారు. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్‌ను ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు. 
 
వ్యాక్సినేషన్ కోసం ఏ రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ నెల 23వ తేదీ నుంచి కొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమల్లోకి తెస్తామని తెలిపారు. 
 
అలాగే, వచ్చే కొన్ని నెలల్లో భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కేంద్రమే డోసులు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని వివరించారు. 
 
ఈ నెల 21 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందిస్తుందని వెల్లడించారు. ఎవరైనా ఉచిత టీకా వద్దనుకుంటే సొంత ఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చన్నారు. రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటుగా వ్యాక్సిన్ పొందవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెస్ట్ బెంగాల్‌లో 10, 12 తరగతుల పరీక్షలు రద్దు : సీఎం మమత వెల్లడి