Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జల్లికట్టు ఉద్యమం.. ఫ్రీ సెక్స్ కోసం జరిగిందట.. రాధారాజన్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆపై క్షమాపణలు..

జల్లికట్టు ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెటా రాధారాజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. జల్లికట్టు ఉద్యమంలో యువత, మహిళలు, ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొన్నారు. అయితే ఈ పోరాటంపై కొద్దిరోజుల క్రితం రేడియోకు ఇ

Advertiesment
PETA
, సోమవారం, 23 జనవరి 2017 (17:03 IST)
జల్లికట్టు ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెటా రాధారాజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. జల్లికట్టు ఉద్యమంలో యువత, మహిళలు, ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొన్నారు. అయితే ఈ పోరాటంపై కొద్దిరోజుల క్రితం రేడియోకు ఇంటర్వ్యూ ఇచ్చిన పెటా సంస్థకు చెందిన రాధారాజన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ సెక్స్ కోసం జల్లికట్టు ఉద్యమం జరుగుతుందని రాధారాజన్ తెలిపారు. 
 
రాధారాజన్ కామెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అంతేగాకుండా ఫ్రీ సెక్స్ కోసం బీచ్‌లో జనం చేరుతారని రాధారాజన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెకు ఆందోళనకారులు నిరసనగా నినాదాలు చేశారు. ఆమె ఇంటిని ముట్టడించారు. తమిళ రాష్ట్రమంతా రాధారాజన్ కామెంట్లపై నిరసన తారాస్థాయికి చేరుకుంది. 
 
ఈ నేపథ్యంలో రాధారాజన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనుచిత వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరుతుందని భావించలేదన్నారు. 
 
ఇంకా తన వ్యాఖ్యలు నొప్పించివుంటే.. బహింరంగంగా క్షమాపణలు చెప్తున్నానని తెలిపారు. తన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనదేనని తెలిపారు. తమిళనాడు ప్రజలు తన వివరణను స్వీకరించాలని కోరుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్ర సృష్టించారు... ఇక ఆందోళన ఆపేయండి... జల్లికట్టు హింసాత్మకంపై రజినీకాంత్