'పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాలి'.. శత్రుఘ్నసిన్హా ఘాటు వ్యాఖ్యలు
దేశంలో నోట్ల రద్దును అధికార బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు చెందిన నేతలు, ఎంపీలు సమర్ధిస్తున్నారు. అయితే, బీజేపీకి చెందిన ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శనాస్
దేశంలో నోట్ల రద్దును అధికార బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు చెందిన నేతలు, ఎంపీలు సమర్ధిస్తున్నారు. అయితే, బీజేపీకి చెందిన ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
నోట్ల రద్దుపై సీ-ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో 86 శాతం మంది ప్రజలు నోట్ల రద్దుకు అనుకూలంగా మద్దతు తెలిపారని ప్రధాని మోడీ ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ప్రధాని మోడీ భ్రమల్లో ఉండకూడదన్నారు. పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు.