Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం... విపక్షాలపై ప్రధాని మోడీ ఆరోపణలు

Advertiesment
Parlimanet Winter Sessions
, సోమవారం, 19 జులై 2021 (13:33 IST)
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 13 వరకు వీటిని కొనసాగించనున్నారు. పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాల రద్దు, రఫేల్‌ ఒప్పందంపై దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తాజా సమావేశాల్లో ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం పక్కా ప్రణాళికలు రూపొందించుకుంది.
 
మరోవైపు, ఈ పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్షాల తీరుపై ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. తన మంత్రివర్గంలోకి కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వారిని సభకు పరిచయం చేసే సమయంలో ప్రతిపక్షాలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. 
 
కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన మ‌హిళా, ద‌ళిత ఎంపీల‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని, ఎంపీల‌ను పరిచ‌యం చేయాల‌నుకున్నాని, కానీ కొంద‌రికి మాత్రం ద‌ళిత ఎంపీలు మంత్రులు కావ‌డం న‌చ్చ‌డం లేద‌ని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్య‌వ‌సాయ‌, గ్రామీణ నేప‌థ్యం ఉన్న‌వారు మంత్రులు అయిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. 
 
మంత్రిమండ‌లిలో ఓబీసీ వ‌ర్గం కూడా ఉంద‌న్నారు. ప్ర‌ధాని మోడీ త‌న మంత్రిమండ‌లి ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో విప‌క్షాలు అడ్డుకోవ‌డాన్ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌ప్పుప‌ట్టారు. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న మ‌ధ్య లోక్‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వర‌కు వాయిదా వేశారు.
 
మరోవైపు, దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా తృణముల్ కాంగ్రెస్ నేతలు పార్టమెంట్‌కు సైకిల్‌పై వచ్చి నిరసన తెలిపారు. 61 సౌత్ అవెన్యూ నుంచి తృణ‌మూల్ ఎంపీలు సైకిల్‌పై పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. నూత‌న రైతుల చ‌ట్టాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని సోమవారం కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. 
 
కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ గిల్‌, మ‌నీష్ తివారీలు ఈ తీర్మానం ఇచ్చిన‌వారిలో ఉన్నారు. సీపీఎం ఎంపీలు కూడా రైతుల నిర‌స‌న‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని నోటీసులు ఇచ్చారు. సీపీఎం ఎంపీ క‌రీమ్‌, వీ శివ‌దాస‌న్‌.. 267 రూల్ కింద నోటీసు ఇచ్చారు. 
 
కాగా దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటింది. దీంతో ప్రతిపక్షాలు నిరసనల బాట పట్టాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తిరుపతి లోక్‌సభ సభ్యుడు