Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ కనుసన్నల్లో సీఎం కె.పళనిస్వామి సర్కార్... దూతగా దినకరన్‌

జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన శశికళ.. ప్రస్తుతం బెంగుళూరు జైలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమెను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకుండా అడ్డుకోవడంలో అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, తమిళనాడు మాజీ ముఖ్

శశికళ కనుసన్నల్లో సీఎం కె.పళనిస్వామి సర్కార్... దూతగా దినకరన్‌
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (06:53 IST)
జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన శశికళ.. ప్రస్తుతం బెంగుళూరు జైలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమెను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకుండా అడ్డుకోవడంలో అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం విజయం సాధించారు. కానీ, రాష్ట్రంలో శశికళ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోలేక పోయారు. దీంతో తాను జైలులో ఉన్న తన కనుసన్నల్లో నడిచే ప్రభుత్వం తమిళనాడులో పాలన సాగించేలా శశికళ చక్రం తిప్పారు. 
 
న్యాయస్థానం కేసులు, తీర్పు, శిక్షలు, ప్రత్యర్థుల కుట్రలు.. ఎవరెన్ని రకాలుగా దాడి చేసినా జయలలిత స్నేహితురాలు శశికళ అన్నాడీఎంకేపై తన పట్టును ఏమాత్రం కోల్పోకుండా పైచేయి సాధించారు. తనకు ఎదురు తిరిగిన పన్నీరుసెల్వానికి వూహించని రీతిలో దెబ్బకొట్టారు. 
 
అన్నాడీఎంకేలోని వర్గపోరు రాజకీయ అనిశ్చితికి దారి తీసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనేది 12 రోజులుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించింది. పన్నీరుసెల్వం, శశికళ వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలను రక్తి కట్టించారు. పదిరోజుల పాటు శాసనసభ్యులను కాపాడుకోవడంలోనూ, వారిని ఐక్యంగా ఉంచడంలోనూ అమ్మ జయలలితను తలపించేలా శశి వ్యూహాలను అమలు చేశారు. తద్వారా కొంతలో కొంత వూరట పొందారు. 
 
తనకు అత్యంత విశ్వాసపాత్రుడు ఎడపాడి పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు ద్వారా పరోక్షంగా శశికళ ఆధిక్యం కొనసాగనుంది. తన సలహాలు, సూచనల ప్రకారం ఇక్కడ పాలన నడిచేలా చిన్నమ్మ కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం ఆమె కుటుంబసభ్యులు, కోటరీ రంగంలోకి దిగింది. ఆమె తన అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిని చేయడం ద్వారా ఆయన పార్టీ నేత హోదాలో ప్రభుత్వ వ్యవహారాలపై ఆయన నిఘా కొనసాగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెన్షన్ భరించలేం.. రిసార్టు బిల్లులు చెల్లించలేం... 18నే బలపరీక్ష.. శశి టీం నిర్ణయం