బీహార్‌లో అబ్బాయిల్ని కిడ్నాప్ చేసి... అలా చేస్తున్నారు?
బీహార్‌లో అబ్బాయిల కిడ్నాప్ ఉదంతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 18 ఏళ్లకు పైబడిన అబ్బాయిలను కిడ్నాప్ చేయడంలో దేశంలో బీహారే నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లి కుమార్తె తరపు వారు అబ్బాయ
బీహార్‌లో అబ్బాయిల కిడ్నాప్ ఉదంతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 18 ఏళ్లకు పైబడిన అబ్బాయిలను కిడ్నాప్ చేయడంలో దేశంలో బీహారే నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లి కుమార్తె తరపు వారు అబ్బాయిని కిడ్నాప్ చేసి.. తలకు గన్ను గురిపెట్టి... అమ్మాయి మెడలో తాళి కట్టేలా చేస్తున్నారు.
అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకున్నా.. బెదిరింపులకు పాల్పడి.. అమ్మాయిలతో పెళ్లి చేయిస్తున్నారు. ఇలాంటి వివాహాలు 2017 దాదాపు 3,400 జరిగాయని బీహార్ పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో ''పకడ్వా వివాహ్'' అనే సంస్కృతికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. పకడ్వా వివాహ్ అంటే వరుడికి ఇష్టం వున్నా లేకున్నా బలవంతపు వివాహం చేసే పద్ధతి. వరకట్నం ఇబ్బందుల కారణంగా పెళ్లి కుమార్తె తరపు బంధువులు, కుటుంబీకులు అబ్బాయిని అపహరించి.. పెళ్లి కుమార్తెతో వివాహం జరిపిస్తారు.
ఈ కల్చర్ పెచ్చరిల్లిపోవడంతో ఇలాంటి వివాహాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు సూచించామని ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. బీహార్‌లో రోజుకు సగటున తొమ్మిది బలవంతపు వివాహాలు జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.