Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాస‌నస‌భ స్థానాలు ఇక పెర‌గ‌వ్... జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు కేంద్రం షాక్

న్యూఢిల్లీ : అసెంబ్లీ స్థానాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగే ప్ర‌స‌క్తే లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. ఆశావ‌హులైన రాజ‌కీయ నాయ‌కుల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ ప్రకారం శాసనసభ స్థానాల పెంపు కోసం తెలంగాణ రాష్ట్రం ఏమైనా ప్రతిపాదనలు పంపింద

Advertiesment
No chance to increase Assembly seats in AP and Telangana
, బుధవారం, 23 నవంబరు 2016 (18:54 IST)
న్యూఢిల్లీ : అసెంబ్లీ స్థానాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగే ప్ర‌స‌క్తే లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. ఆశావ‌హులైన రాజ‌కీయ నాయ‌కుల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ ప్రకారం శాసనసభ స్థానాల పెంపు కోసం తెలంగాణ రాష్ట్రం ఏమైనా ప్రతిపాదనలు పంపిందా? కేంద్రం తీసుకున్న చర్యలేంటి? అని రాజ్యసభలో ఎంపీ టీ.జీ వెంకటేష్ ప్ర‌శ్నించారు. దీనికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి హన్సరాజ్ ఆర్టికల్ 170 (3) ప్రకారం జనాభా గణన అనంతరమే శాసనసభ స్థానాల పునర్విభజన సాధ్యమని వెల్లడించారు. 
 
శాసనసభ స్థానాల పెంపుపై అటార్నీ జనరల్ సలహా కోరిన న్యాయమంత్రిత్వ శాఖ స్ప‌ష్ట‌మైన సంకేతాలు వ‌చ్చాయి. విభజన చట్టంలోని 26 సెక్ష‌న్ అనుగుణంగా ఆర్టికల్ 170ని సవరించే వరకు శాసనసభ స్థానాల సంఖ్య పెంపు సాధ్యం కాదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ స్ప‌ష్టం చేశారు. ఇక దీనితో అటు ఏపీ, ఇటు తెలంగాణాలో ఆశావ‌హులైన నాయ‌కుల నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డింది. 
 
ముఖ్యంగా పార్టీలు విచ్చ‌ల‌విడిగా ఫిరాయించిన నేత‌లను పెరిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్దుబాటు చేయాల‌ని పార్టీలు భావించాయి. ఇపుడు అసెంబ్లీ స్థానాలు పెర‌గ‌వ‌ని కేంద్రం తెగేసి చెప్ప‌డంతో రాజ‌కీయ పార్టీల్లో టిక్కెట్ల కోసం కుమ్ములాట‌లు పెరిగిపోక‌త‌ప్ప‌వు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలి కంటే భారీగా... కాంగ్రెస్ నేత కొడుకు పెళ్లి జరుగబోతోంది, ఇక రాహుల్ ఏం మాట్లాడుతారో?