Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''బహుమాస్ లీక్‌'' లిస్టులో నిమ్మగడ్డ ప్రసాద్.. 475 కంపెనీల నల్లముఠా గుట్టు రట్టు..

ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌) కింద నల్ల ధనం వివరాలను వెల్లడించేందుకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు విధించిన తరుణంలో బహమాస్‌ లీక్స్‌ జాబితాలో పెద్ద ఎత్తున భారత కార్పొరేట్‌ రంగానికి చెందిన కంపెనీలు ఉండటం

''బహుమాస్ లీక్‌'' లిస్టులో నిమ్మగడ్డ ప్రసాద్.. 475 కంపెనీల నల్లముఠా గుట్టు రట్టు..
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:35 IST)
ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌) కింద నల్ల ధనం వివరాలను వెల్లడించేందుకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు విధించిన తరుణంలో బహమాస్‌ లీక్స్‌ జాబితాలో పెద్ద ఎత్తున భారత కార్పొరేట్‌ రంగానికి చెందిన కంపెనీలు ఉండటం సంచలనం రేపింది. బహుమాస్ లీక్‌తో మళ్లీ బ్లాక్ రాయుళ్ళ సంగతి బయటికొచ్చింది. మొన్న పనామా పేపర్స్ వల్ల నల్ల కుబేరుల వ్యవహారం బయటపెట్టిన సంగతి తెలిసిందే. 
 
''పనామా'' లీక్స్ తరహాలోనే ‘బహమాస్’ పేపర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు బహమాస్‌ లీక్‌ పేరుతో నల్ల దొంగల వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలు చేశాయి. ఈ 475 మంది పేర్లతోనే లక్షా 75 వేల సంస్థలున్నట్లు ‘బహమాస్’లీక్ చేసింది.
 
పనామా పేపర్స్‌ సృష్టించిన సంచలనం మరువక ముందే ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే).. మరోసారి సంచలనాత్మకమైన పత్రాలను బయటపెట్టింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లు ఉండటం సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖంగా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వినపడుతోంది. ఈయనకు సికింద్రాబాద్ లోని ఒకే అడ్రస్ నుంచి 20 సంస్థలున్నట్లు ‘బహమాస్ ’బయటపెట్టింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ‘బహమాస్‌ లీక్స్‌’ పేరిట ‘నల్ల ముఠా’ గుట్టు రట్టు చేసింది. 
 
జర్మనీ వార్తాపత్రిక సడుట్చే జైటుంగ్‌, భారత్‌లోని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు మీడియా భాగస్వాములతో కలిసి బహమాస్‌ దేశంలో నమోదైన 1,75,000 కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్లు, వ్యక్తుల ఆస్తుల వివరాలను విడుదల చేసింది. ఈ బహమాస్‌ లీక్స్‌ జాబితాలో భారత కార్పొరేట్‌ రంగంతో సంబంధం ఉన్న 475 సంస్థలున్నాయి. 
 
ఇదే లిస్టులో నిమ్మగడ్డతో పాటు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, బారన్‌ గ్రూప్‌ అధినేత కబీర్‌ మూల్‌చందానీ, ఫ్యాషన్‌ టీవీ ఇండియా ప్రమోటర్‌ రాజన్‌ మధు, ప్రీమియం ఫిన్నిష్‌ వాటర్‌ బ్రాండ్‌ చైర్మన్‌ అమన్‌ గుప్తా, గుర్జీత థిల్లాన్‌, హర్‌భజన్‌ కౌర్‌, మైరా డిలోరస్‌ రెగో, అశోక్‌ చావ్లా సహా ఇంకా ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో వెల్లడించింది. పనామా పేపర్స్‌ లీక్‌లో ఉన్న ప్రముఖులు.. బహమాస్‌ లీక్స్‌లోనూ ఉండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌తో భేటీ అందుకే.. కావేరి జలాల పరిష్కారానికి ''అమ్మ'' కృషి చేయాలి