Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

sea-level rise

ఠాగూర్

, శుక్రవారం, 22 నవంబరు 2024 (08:40 IST)
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక తీర ప్రాంతాల గ్రామాలు మునిగిపోయే ప్రమాదం పొంచివుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి ఉండే ప్రధాన నగరాలతో పాటు తీర ప్రాంత గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వాతావరణ మార్పులు కారణంగా మానవాళికి ముప్పుగా పరిణమించనున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ముఖ్యంగా, సముద్ర తీర ప్రాంత వాసులు ప్రమాదం ముంగిట ఉన్నారని వివరించారు. నేచురల్ క్లైమేట్ చేంజ్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం... 2,100 నాటికి సముద్ర నీటి మట్టం ఒక మీటరు మేర పెరగనుందని, దీని ప్రభావం ఆగ్నేయ అట్లాంటిక్ తీర ప్రాంతం, నార్ ఫోక్, వర్జీనియా, మయామీ, ఫ్లోరిడా ప్రాంతాల్లో 1.4 కోట్ల మంది ప్రజలపై ఉంటుందని ఉందని తెలిపారు.
 
తీవ్రస్థాయిలో సంభవించే వరదలతో భూమి కుంగిపోతుందని, బీచ్‌లు జలమయం అవుతాయని వర్జీనియా టెక్ జియోసైన్స్ విభాగానికి చెందిన మనూచెర్ షిరాజాయ్ వెల్లడించారు. భూగర్భజలాలు విపరీతంగా పెరిగిపోవడం కూడా సమస్యాత్మకంగా మారుతుందని అన్నారు.
 
ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం... కోట్లాది మంది నిరాశ్రయులవుతారని, కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని వివరించారు. భవిష్యత్ కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలన్న అవసరాన్ని ఈ అధ్యయనం సూచిస్తుందని షిరాజాయ్ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్