Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలోనే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం... : రాజ్‌నాథ్ సింగ్

కాశ్మీర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని దేశాన్ని అస్థిరపరచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. అందువల్ల కాశ్మీర్ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుగొంటుందన

Advertiesment
త్వరలోనే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం... : రాజ్‌నాథ్ సింగ్
, ఆదివారం, 21 మే 2017 (16:47 IST)
కాశ్మీర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని దేశాన్ని అస్థిరపరచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. అందువల్ల కాశ్మీర్ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుగొంటుందన్నారు. 
 
సిక్కింలోని పెల్లింగ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, కశ్మీర్‌లో సమస్యలను సృష్టించడం ద్వారా దేశాన్ని అస్థిరపరచేందుకు పాక్ దుష్టపన్నాగాలు పన్నుతోందన్నారు. 'అయితే మీకో మాట చెప్పదలచుకున్నాను. కాశ్మీర్ సమస్యకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటుంది' అని చెప్పారు. 
 
'కాశ్మీర్ మనది. కాశ్మీరీలు మనవాళ్లు. కాశ్మీరియత్ కూడా మనదే. అందుకే సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం' అని ఆయన తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌లో మార్పు వస్తుందనే అశిస్తున్నామని, ఒకవేళ మార్పు రాకపోతే వారిని మనమే మారుస్తామని అన్నారు. గ్లోబలైజేషన్ తర్వాత ఒక దేశం మరొకదేశాన్ని అస్థిరపరచరాదని, అంతర్జాతీయ సమాజం దీనిని ఒప్పదని రాజ్‌నాథ్ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో నారా లోకేష్‌ కుమారుడు ఆ పని చేశాడు.. ఏంటది..!