Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవనీత్ కంటతడి.. ఓదార్చిన భర్త.. వీడియో వైరల్ (video)

Advertiesment
navneet kaur
, శుక్రవారం, 6 మే 2022 (22:34 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద గత నెల 23న హనుమాన్‌ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో నవనీత్ కౌర్ దంపతులను ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రవిరాణా విడుదలకు రెండుగంటల ముందు బైకుల్లా మహిళా జైలునుంచి ఆయన భార్య నవనీత్‌ కౌర్‌ రాణా విడుదలయ్యారు. 
 
అనంతరం నవనీత్‌ రాణా అనారోగ్య సమస్యలతో సబ్‌ అర్బన్‌ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు. 
 
వార్డులో నవనీత్‌రాణా కంటతడి పెడుతండగా.. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో క్లిప్పింగ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 
 
ఆరు రోజుల నుంచి నవనీత్‌ ఆరోగ్యం బాగోలేదని బైకులా జైలు అధికారులకు ఫిర్యాదు చేసిందని, అయితే కనీసం జైలు అధికారులెవరూ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని రవిరాణా ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. గ్రూప్ అడ్మిన్‌కు ఇది గుడ్ న్యూస్