Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాసా షాకింగ్ ఫోటో.. భూమి ఎరుపు ఫోటో.. జీవరాశి మనుగడ?

nasa
, గురువారం, 21 జులై 2022 (21:26 IST)
భూమికి సంబంధించి నాసా షాకింగ్ ఫోటోను విడుదల చేసింది. భూమి వేడెక్కుతుందని చెప్తున్నా పట్టించుకోని ప్రజలకు ఈ ఫోటో షాకింగ్  ఇస్తుంది. భూమి విపరీతంగా వేడెక్కుతున్నట్లు చూపించే చిత్రాన్ని నాసా విడుదల చేసింది. 
 
ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని అనేక దేశాలలో జూన్, జూలైలలో తీవ్రమైన వేడిని నమోదవుతుంది.  నాసా ప్రచురించిన భూమి హీట్ మ్యాప్ 46 సంవత్సరాలలో ఇదే అత్యంత షాకింగ్‌ న్యూస్‌గా తెలిసింది. ప్రస్తుతం నాసా విడుదల చేసిన ఫోటోలో భూమి నీలం నుండి ఎరుపు రంగులోకి మారిందని చూపిస్తుంది.  దాంతో భూమిపై మనుగడ సమస్యత్మాకంగా మారుతోందని, జీవరాశిని నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
 
గొడ్దార్డ్ ఎర్త్ అబ్జర్వింగ్ సిస్టమ్ (GEOS) అనేది గ్లోబల్ మోడల్ వెర్షన్‌లో కనిపించే పరిశీలనలను కలపడం ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది వాతావరణంలోని భౌతిక ప్రక్రియలను సూచించడానికి గణిత సమీకరణాలను ఉపయోగిస్తుంది. 
 
ఇందులో వేర్వేరు ప్రదేశాలలో వాతావరణ మార్పులు.. విభిన్న నమూనాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అధిక వేడితో ఎర్రగా మారి కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాలు చల్లగా నీలం రంగులో ఉంటాయి. 
 
కానీ అధిక వేడిగా ఉండే ప్రాంతాలు మానవుడు కలిగించే కాలుష్యం కారణంగా గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలతో భూమి తన స్వరూపాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Draupadi Murmu: 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము