Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్య రామ జన్మభూమి ట్రస్టుకు ముఖేశ్ అంబానీ భారీ విరాళం

mukesh ambani family

వరుణ్

, మంగళవారం, 23 జనవరి 2024 (10:21 IST)
అయోధ్య రామ జన్మభూమి ట్రస్టుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరళాన్ని ప్రకటించారు. అంబానీ కుటుంబ సభ్యులు కలిసి ఈ ట్రస్ట్‌కు ఏకంగా రూ2.51 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళం అయోధ్య రామమందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నమని వ్యాఖ్యానించారు. కాగా, సోమవారం అయోధ్య నగరంలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహా ఘట్టానికి ముఖేశ్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత తమ కుటుంబం తరపున ఆయన భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు రామజన్మభూమి ట్రస్ట్‌కు ఈ పెద్ద మొత్తాన్ని ప్రటించి, ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
"ముఖేశ్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.2.51 కోట్లు విరాళంగా అందించారు. సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగివున్న అయోధ్య రామ మందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నం' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సోమవారం అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు ముఖేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ, కుమారులు అకాశ్, అనంత్, కోడలు శ్లోకా మెహతాలతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్, కుమార్తె ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమాల్ పాల్గొన్నారు. అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించి  ప్రముఖుల్లో వీరంతా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైబర్ మోసగాళ్ల మోసం.. రూ.41.49 లక్షలు స్వాహా.. పెట్రోల్ పంప్ పేరిట?