Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశీకి వెళ్లి పోతానని వెళ్లి రాసలీలలు మొదలెట్టాడు.. నైట్ వేసుకుని వర్షతో రొమాన్స్..

కాశీకి వెళ్లి పోతానని అక్కడే సమాధి అయిపోతానంటూ లేఖ రాసిపెట్టి మాయమైన ఓ నిర్మాత ఉల్లాస జీవితాన్ని గడిపాడు. ఆయన ఎవరో కాదు వేందర్ మూవీస్ మదన్. గత మే నెలలో పరారైన మదన్ తన ప్రియురాళ్లతోనూ, అందమైన యువతులతోన

Advertiesment
Missing producer 'Vendhar Movies' Madhan arrested from Tirupur hideout
, బుధవారం, 23 నవంబరు 2016 (09:00 IST)
కాశీకి వెళ్లి పోతానని అక్కడే సమాధి అయిపోతానంటూ లేఖ రాసిపెట్టి మాయమైన ఓ నిర్మాత ఉల్లాస జీవితాన్ని గడిపాడు. ఆయన ఎవరో కాదు వేందర్ మూవీస్ మదన్. గత మే నెలలో పరారైన మదన్ తన ప్రియురాళ్లతోనూ, అందమైన యువతులతోనే సంబంధాలు పెట్టుకుని హరిద్వార్‌, గోవా తదితర నగరాలకు వారిని వెంటబెట్టుకునే తిరిగాడు. ఈ వివరాలన్నీ క్రైం పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 
 
ఇకపోతే.. మదన్‌కు ఇద్దరు భార్యలున్నారు. ఎస్సారెమ్‌ యూనివర్శిటీ మెడిసిన్ సీట్లిప్పిస్తానంటూ విద్యార్థుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.84 కోట్లతో పరారయ్యేందుకు సిద్దమై రెండోభార్యకు వడపళనిలో ఓ ప్లాటును, మొదటి భార్యకు కేరళలో ఓ ఇంటిని కొనిచ్చాడు. ఇక వేందర్ మూవీస్ అధినేత పనిచేస్తున్నప్పుడు తన వద్దకు సినిమా ఛాన్సుల కోసం వచ్చిన వర్ష, గీతాంజలి వంటి అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. ఇలా పలువురు అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు.
 
గీతాంజలితోనే ఆయన తన అజ్ఞాతవాసాన్ని హరిద్వార్‌ నుంచి ప్రారంభించాడు. గీతాంజలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియగానే ఆమెను వెనక్కి పంపాడు. ఆ తర్వాత రెండు నెలలపాటు గోవా, బెంగుళూరు, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో సంచరించాడు. రూ.60 లక్షలతో లగ్జరీ కారు కొన్నాడు. పది ఎకరాల ఫామ్‌హౌస్‌ కొన్నాడు. ఇలా ఉత్తరాదిన తలదాచుకున్నాడు. ఇలా వర్షతో రాసలీలలు కొనసాగిస్తూ హ్యాపీగా ఉండిన అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. వర్షతో ఉన్నప్పుడు నైటీ వంటి ఆడోళ్ల డ్రెస్సులు వేసుకునేవాడని పోలీసులు తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దు ఓ మహాయజ్ఞం.. ఓ విప్లవాత్మకం : వెంకయ్య నాయుడు