Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనర్ బాలికపై ఏడుగురు బలాత్కారం... ఎక్కడ?

Advertiesment
మైనర్ బాలికపై ఏడుగురు బలాత్కారం... ఎక్కడ?
, ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (11:29 IST)
ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ఏడుగురు కామాంధులు బలాత్కారానికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ స్థానిక పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఇందులో మార్చి-ఏప్రిల్‌ (లాక్‌డౌన్‌ సమయం)లో తన కుమార్తెపై కొందరు లైంగిక దాడి చేసినట్లు అందులో పేర్కొంది. 
 
దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు చెందిన ముగ్గురు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు వ్యక్తులతో సహా ఏడుగురు ఈ అకృత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. బాలిక తన వాగ్మూలంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోఓదు చేసినట్లు డీసీపీ ఉమాశంకర్‌ దాష్‌ తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలకు బంధించిన దర్యాప్తు విభాగానికి ఈ కేసును అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య పుట్టింటికి వెళ్లిందనీ.. భర్త బలవన్మరణం