Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశం

manipur violance
, శుక్రవారం, 28 జులై 2023 (10:11 IST)
యావత్ దేశాన్ని కలవరపాటుకు గురించిన మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు వీడియో కేసుపై నిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా, ఈ ఘటనపై విచారణకు సీబీఐను ఆదేశించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది.
 
ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమైన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించి వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
 
కేసు విచారణను కూడా మణిపూర్ బయట చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసోంలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణను చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి. మరోవైపు, మణిపూర్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ మెయితీలు, కుకీలతో సంప్రదింపులు జరుపుతోంది. చర్చలు పురోగతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 
 
అప్పు తీర్చలేదని భార్యపై అత్యాచారం...  
 
తీసుకున్న అప్పు తీర్చలేదన్న అక్కసుతో కట్టుకున్న భర్త కళ్లెదుటే భార్యను కొందరు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. ఈ ఘటన ఫిబ్రవరి నెలలో జరుగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కామాంధులు వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బహిర్గతమైంది. 
 
పూణెకు చెందిన బాధిత భార్యాభర్తలు ఇంతియాజ్ షేక్ అనే వ్యక్తి నుంచి కొంతకాలం క్రితం కొంత మొత్తంలో రుణం తీసుకున్నారు. దాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేక పోయారు. ఈ క్రమంలో నిందితుడి మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ అకృత్యాన్ని కామాంధులు వీడియో తీశారు. 
 
ఆతర్వాత పలుమార్లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎదురు చెప్పకపోవడంతో ఆ వీడియోను సోమాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. అతడి ఆగడాలను భరించలేని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 కోట్లు గెలుచుకున్న 11 మంది మహిళలు