Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపూర్‌ ఘటన : ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలి

Advertiesment
supreme court
, మంగళవారం, 1 ఆగస్టు 2023 (15:09 IST)
మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల్ని నగ్నంగా ఊరేగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. మే 3నుంచి మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. 
 
ఇలాంటి ఘటనలు ఇప్పటికి దేశంలో చాలా జరిగాయని, మణిపూర్‌లో ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ధర్మాసనం సుమోటోగా తీసుకుంది. 
 
అంతేకాకుండా బాధిత మహిళల్లో ఒకరి సోదరుడు, తండ్రి మరణించగా.. వారి మృతదేహాలు ఇప్పటికీ కుంటుంబానికి అప్పగించలేదు. ఈ కేసులో దర్యాప్తుకు మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిని గొంతుకోసి హత్య- ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు..